Mahesh Babu : అన్న కొడుకుని పరిచయం చేయబోతున్న మహేష్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా.. ఎప్పుడు ఎక్కడ?
నివాస మంగాపురం సినిమా జులై 9న రిలీజ్ కానుంది. (Mahesh Bab)
Mahesh Babu
Mahesh Babu : ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జయకృష్ణ హీరోగా బాలీవుడ్ భామ రాషా తడాని హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస మంగాపురం. అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మాణంలో RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు. శ్రీనివాస మంగాపురం సినిమా జులై 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మహేష్, ఘట్టమనేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గెస్ట్ గా రానున్నాడట.
శ్రీనివాస మంగాపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జులై 2 సాయంత్రం 6 గంటల నుంచి జరగనుందని సమాచారం. ఈ ఈవెంట్ కి మహేష్ బాబు గెస్ట్ గా హాజరయి తన అన్న కొడుకు జయకృష్ణని అభిమానులకు పరిచయం చేయనున్నాడు. దీంతో ఈ ఈవెంట్ కి భారీగా ఘట్టమనేని ఫ్యాన్స్ తరలి రానున్నారు.
