Aadarsha Kutumbam : నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి రేంజ్ లో ఉంటుంది ఆదర్శ కుటుంబం.. వెంకటేష్ కామెంట్స్..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. (Aadarsha Kutumbam)
Aadarsha Kutumbam
Aadarsha Kutumbam : వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్టోబర్ 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రఘుబాబు, యువిన పార్థవి, ప్రజ్వల.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.. ఆదర్శ కుటుంబం సినిమాను మేము చాలా కొత్తగా ప్రయత్నించాము. త్రివిక్రమ్ ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచకుండా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో అలరిస్తుంది అని అన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రేపు థియేటర్లలో కలుద్దాం. ఆదర్శ కుటుంబం సినిమా మీ అందరికీ నచ్చుతుందని, మీరందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తర్వాత ఓ అద్భుతమైన కథతో రావాలనే ఉద్దేశంతోనే వెంకటేష్ తో సినిమా చేయడానికి ఇంత సమయం తీసుకోవడం జరిగింది అని అన్నారు.
Also Read : Vishwak Sen : ఫ్యాన్స్ మీట్ వివాదంపై స్పందించిన విశ్వక్ సేన్.. మా ఆర్గనైజర్స్ తప్పు ఉంది..
నారా రోహిత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలా సార్లు చూశాను. అలాంటి కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది అని తెలిపారు. తమన్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ గారి కలం బలం గురించి అందరికీ తెలుసు. ఇంక్ తో అందరినీ థింక్ చేసేలా చేస్తారు. ఒక సీన్ ని తన మాటలతో గొప్పగా మలుస్తారు. తాజాగా ఎనిమిది పాటలతో జ్యూక్ బాక్స్ విడుదల చేశాం. సినిమా ఫైనల్ కాపీ చూసి మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాం అని అన్నారు.
