‘పుష్ప’లో అల్లు అర్జున్ అనుకున్నారా.. అల్లరి నరేష్ కొత్త మాస్ గెటప్..

తాజాగా బచ్చల మల్లి సినిమా నుంచి అల్లరి నరేష్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు.

Allari Naresh Poster Released from Bachalamalli Movie Allari Naresh Looks like Pushpa Allu Arjun Poster goes Viral

Allari Naresh : అల్ల‌రి న‌రేష్ తన రూటు మార్చి సరికొత్త సినిమాలు తీస్తూ హిట్ కొడుతున్న సంగతి తెలిసిందే. త్వరలో అల్లరి నరేష్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ అనే సినిమాతో రాబోర్తున్నాడు. సుబ్బు మంగాదేవి ద‌ర్శ‌క‌త్వంలో హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా కనిపిస్తుంది.

ప్రస్తుతం బచ్చల మల్లి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లరి నరేష్ పోస్టర్ రిలీజ్ చేసి పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల, చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్ అని సినిమాలో నరేష్ క్యారెక్టర్ గురించి చెప్పారు. రేపు అల్లరి నరేష్ పుట్టిన రోజు ఉండటంతో ఓ స్పెషల్ గ్లింప్స్ ని సినిమా నుంచి రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి తాజాగా బచ్చల మల్లి సినిమా నుంచి అల్లరి నరేష్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు.

అయితే ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఈ పోస్టర్ మొదటిసారి చూడగానే అల్లు అర్జున్ అనుకుంటున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఏమో అని భ్రమపడుతున్నారు. ఈ పోస్టర్ చూసిన వాళ్లంతా అల్లరి నరేష్ పుష్పలోని అల్లు అర్జున్ లాగా ఉన్నాడేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అల్లరి నరేష్ ఈ సినిమా కోసం ఏ రేంజ్ మేకోవర్ చేసాడో అర్ధమవుతుంది. రేపు గ్లింప్స్ లో అల్లరి నరేష్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో చూడాలి. ప్రస్తుతం అల్లరి నరేష్ పోస్టర్ వైరల్ అవుతుంది. బన్నీ అభిమానులు కూడా పుష్పలో అల్లు అర్జున్ లా ఉన్నావంటూ అల్లరి నరేష్ పై కామెంట్స్ చేస్తున్నారు.