Vijay: విజయ్ కి షాక్ ఇచ్చిన కొడుకు.. తండ్రి పేరును తొలగించిన జాసన్ సంజయ్.. తల్లికి సపోర్ట్ గానే
జాసన్ సంజయ్ తన పేరు నుంచి తన తండ్రి విజయ్(Vijay) పేరును తొలగించాడు.
Jason Sanjay removes his father Vijay name from his own.
Vijay: తమిళ రాజకీయాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారింది. దళపతి విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వేళ, ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తన కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చింది.
విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ త్వరలో దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే, తన సోషల్ మీడియా హ్యాండిల్స్, తన కొత్త ప్రాజెక్ట్ క్రెడిట్స్‌లో ఆయన పేరు ‘జాసన్ సంజయ్ విజయ్’ కి బదులుగా ‘జాసన్ సంజయ్ సంగీత’ గా మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తండ్రి పేరును పూర్తిగా పక్కన పెట్టి, తల్లి పేరును తన గుర్తింపుగా మార్చుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Allu Cinemas: హైదరాబాద్‌లో అల్లు మార్క్ మ్యాజిక్.. సీఎం చేతుల మీదుగా ‘అల్లు సినిమాస్’ షురూ!
విజయ్ భార్య సంగీత ఇటీవల ఆయన నుంచి విడాకులు కోరుతూ కొట్టుకెక్కిన విషయం తెలిసిందే. విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందని, తన నుంచి విడాకులు కావాలంటూ ఆమె పిటీషన్ వేశారు. దానికి, బలం చేకూరుస్తూ విజయ్ హీరోయిన్ త్రిషతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఈ నేపధ్యంలోనే, తన తల్లికి సపోర్ట్ గా నిలవాలనుకున్న జాసన్ సంజయ్ తన పేరు నుంచి తండ్రి పేరును తొలగించి తల్లి పేరును జత చేసుకున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.
ఇక విజయ్ ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో ఇటువంటి వ్యక్తిగత వివాదాలు ఆయన ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ వివాదాల నుంచి విజయ్ ఎలా బయటపడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి జాసన్ సంజయ్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం వ్యక్తిగతమా? లేక కుటుంబంలో నెలకొన్న తీవ్ర విభేదాల ఫలితమా? అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, రాజకీయాల్లో దూసుకుపోవాలని చూస్తున్న విజయ్‌కు ఇది ఒక గట్టి సవాలు అనే చెప్పాలి.
