Supreme Court Comments : అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీతారెడ్డి కోరారు. అయితే సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Supreme Court (7)

YS Avinash Reddy : వైఎస్ వివేక హత్య కేసు (YS Viveka Case)లో వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఇన్ పర్సన్ గా సునీతారెడ్డి వాదనలు వినిపించారు. తన తండ్రి (వైఎస్ వివేక) హత్య వెనుక కుట్ర కోణం ఉందని, అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి కోరారు. జూన్ 30 వరకు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని సునీతారెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీతారెడ్డి కోరారు. అయితే సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు. సునీతారెడ్డి వ్యక్తిగత పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తు కు అవినాష్ రెడ్డి సహకరిస్తున్నపుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని పేర్కొంది.

Revanth Reddy : అరవింద్ కుమార్ లీగల్ నోటీసులు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.. వాటిని వెనక్కి తీసుకోవాలి : రేవంత్ రెడ్డి

ఎప్పుడు ఏం చేయాలో సీబీఐకి తెలుసని తెలిపింది. సునీతా రెడ్డి పిటిషన్ ను వెకేషన్ బెంచ్ విచారించాల్సినంత తొందర ఏముందని ప్రశ్నించింది. సీబీఐకి వెంటనే నోటీసులు ఇవ్వాలన్న సునీతా రెడ్డి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. “అవినాష్ ను జైల్లో పెట్టాలన్న లక్ష్యంతో మీరు ఉన్నట్లు కనిపిస్తుంది” అని సుప్రీంకోర్టు సునీతారెడ్డితో వ్యాఖ్యానించింది.

అవినాష్ రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని సునీతారెడ్డి కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో లేదో సీబీఐ నిర్ణయిస్తుందని వెల్లడించింది. అదనపు సమాచారం ఇచ్చేందుకు అంగీకరిస్తూ సునీతారెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు జూన్ 19కి వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు