Revanth Reddy : అరవింద్ కుమార్ లీగల్ నోటీసులు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.. వాటిని వెనక్కి తీసుకోవాలి : రేవంత్ రెడ్డి

ఐఆర్బీ సంస్థకు టెండర్ కట్టబెట్టే క్రమంలో యదేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా బేస్ ప్రైస్ పై అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు.

Revanth Reddy

Arvind Kumar Legal Notice : ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో మే 25న అరవింద్ కుమార్ తనకు పంపిన లీగల్ నోటీసుకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు.

అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు తనను అణిచివేయాలనే ఈ నోటీసులు పంపారని ఆరోపించారు. లీగల్ నోటీసులో పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమని తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంలో రాజకీయ నాయకుడిలా అరవింద్ కుమార్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Medchal : పెళ్లైన ఆరు నెలలకే.. ఉరేసుకుని యువ దంపతులు ఆత్మహత్య

అడిగిన సమాచారం ఇవ్వకుండా రాజకీయ నాయకుడిలా ఎదురు దాడి చేస్తున్నారని వెల్లడించారు. అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి.. కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు.

ఐఆర్బీ సంస్థకు టెండర్ కట్టబెట్టే క్రమంలో యదేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా బేస్ ప్రైస్ పై అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఓఆర్ఆర్ పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్ నివేదికను కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని వెల్లడించారు.

Cyber Criminals : సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి.. రూ. కోటిన్నర పోగొట్టుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్

నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ ఆఫీసరును నియమించి ఓఆర్ఆర్ టెండర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. ఎన్ని నోటీసులిచ్చినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు