ఇదేందయ్యా ఇది..! వరుసగా రెండుసార్లు ఓడినా.. ఇప్పటికీ అతడే ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే విచిత్ర పరిస్థితి

గత ఐదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ ఇదే అనుభవం ఎదుర్కొన్నారు ప్రభాకర్‌. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారులు వచ్చాక రికార్డులు అప్డేట్‌ చేస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగుతుండటంతో విస్తుపోవడం ప్రభాకర్‌ వంతవుతోంది.

Gossip Garage : ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. అవును నేను అన్నది నిజమే.. మీరు విన్నదీ నిజమే… ఇదేంటి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కదా.. ఎమ్మెల్యే అంటున్నారేంటి అని సందేహిస్తున్నారా…? ఉప్పల్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ అని చెబుతున్నది మేం కాదు.. స్వయంగా తెలంగాణ సీఎంవో అధికారులే… ప్రభాకర్‌ను ఉప్పల్‌ ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నారు. 2018లో ప్రభాకర్‌ మాజీ అయినా ఐదున్నరేళ్లుగా సీఎంవో ప్రభాకర్‌ను ఎమ్మెల్యేగానే చూస్తోంది…. రోజూ అధికారిక సమాచారాన్ని షేర్‌ చేస్తోంది. ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ పొలిటికల్‌ స్టోరీ పూర్తి వివరాలు..

సీఎంవో ఫైల్స్‌లో ఇప్పటికీ ఉప్పల్‌ ఎమ్మెల్యేగా ప్రభాకర్ కొనసాగింపు..
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 2014లో ఉప్పల్ ఎమ్మెల్యేగా గెలిచారు.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఓడిపోయిన ప్రభాకర్‌ మాజీ అయ్యారు. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదృష్టం పరీక్షించుకున్నా…. ఆయన తలరాత మారలేదు. కానీ, సీఎంవో ఫైల్స్‌లో ఇప్పటికీ ప్రభాకర్‌ ఉప్పల్‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. దీంతో తరచూ ప్రభుత్వ నుంచి ఉప్పల్‌ ఎమ్మెల్యేకు రావాల్సిన సమాచారం, అధికారిక ఆహ్వానాలు ప్రభాకర్‌కు అందుతున్నాయి… ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయం నుంచి అధికారిక ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ప్రొటోకాల్ ఆహ్వానాలు అందుతున్నాయి. రెవిన్యూ, ఆరోగ్య శాఖ నుంచి అయితే ఏకంగా ఫోన్ కాల్స్ కూడా తరచూ వస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేగారు.. అంటూ తరుచూ ఫోన్లు..
సార్… సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం మీరు రిఫర్‌ చేసిన వారికి…. డబ్బు రిలీజ్‌ చేశాం.. వచ్చి చెక్కు తీసుకోండి. ఆ డిటైల్స్‌ మీకు ఎస్‌ఎంఎస్‌ చేస్తున్నామని తరచూ వస్తున్న ఫోన్లతో విస్తు పోతున్నారు ప్రభాకర్‌. ఇక ప్రొటోకాల్ అధికారులైతే మరి దారుణం.. సార్ ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఫలానా కార్యక్రమానికి హాజరుకావాలి.. మీ పాసులు మా వద్ద ఉన్నాయి.. వచ్చి తీసుకువెళ్ళండంటూ కాల్స్ చేస్తున్నారు.. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సైతం ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయంట..

ఐదున్నరేళ్ల క్రితమే మాజీ, అయినా అప్డేట్ చేయని సీఎంవో అధికారులు…
ఇలా కాల్ చేస్తున్న అధికారులకు తాను ఎమ్మెల్యేను కాదని.. ఐదున్నరేళ్ల క్రితమే మాజీనయ్యానని ప్రభాకర్‌ చెబుతున్నా… సీఎంవో అధికారులు ఆప్డేట్‌ చేయడం లేదట. ఈ తంతు ఇప్పుడే మొదలుకాలేదు. ఎప్పటి నుంచో ఇదే కొనసాగుతోంది. గత ఐదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ ఇదే అనుభవం ఎదుర్కొన్నారు ప్రభాకర్‌. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారులు వచ్చాక రికార్డులు అప్డేట్‌ చేస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగుతుండటంతో విస్తుపోవడం ప్రభాకర్‌ వంతవుతోంది.

వరుసగా రెండుసార్లు ఓడినా.. ఎమ్మెల్యేగా కొనసాగింపు..
బీజేపీ సీనియర్‌ నేత ప్రభాకర్‌ 2014 నుంచి ఉప్పల్‌ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. 2014-2018 మధ్య ఎమ్మెల్యేగా కొనసాగిన ప్రభాకర్‌… వరుసగా రెండుసార్లు ఓడిపోయినా ప్రభుత్వ రికార్డుల్లో ఆయనే ఉప్పల్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతుండటం విశేషం. ఇక గత రెండుసార్లు ఉప్పల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ, అప్పుడూ ఇప్పుడూ సీఎంవో రికార్డుల్లో ప్రభాకర్‌ పేరు కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మొత్తానికి పొరపాటు మాట ఎలా ఉన్నా… ఈ టాపిక్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో తమాషాగా మారింది.

Also Read : కేసీఆర్‌ అసెంబ్లీకి వెళ్తారా, లేదా? బీఆర్ఎస్‌కు జూలై 24 టెన్షన్..! కాంగ్రెస్ వ్యూహం ఏంటి..

ట్రెండింగ్ వార్తలు