ఇదో అద్భుత కార్యక్రమం.. మాట నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసి, తెలంగాణ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలబడబోతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy on Crop loan waiver: నూటికి నూరు శాతం రైతులను రుణవిముక్తులను చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అన్నదాతల అప్పును సంపూర్ణంగా మాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. గురువారం సాయంత్రం రుణమాఫీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇదో అద్భుత కార్యక్రమం, జీవితంలో మరిచిపోలేని రోజు, దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశం తనకు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అవుతుందని రుజువు చేశామని అన్నారు. మంత్రుల, అధికారుల సహకారంలో రుణమాఫీ చేశామని వెల్లడించారు.

అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసి, తెలంగాణ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలబడబోతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నెలాఖరులో వరంగల్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎక్కడ చేసామో అక్కడే కృతజ్ఞత సభ నిర్వహిస్తామన్నారు. రెండో విడతలో సున్నా నుంచి లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. మూడో విడతలో సున్నా నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని వివరించారు.

రుణమాఫీకి కొలబద్ద పాసుపుస్తకమే
ఎలాంటి షరతులు లేకుండా మూడు విడతల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ చేశారు. రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రతిపాదిక కాదని క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీకి ప్రభుత్వం రేషన్ కార్డు అడుగుతోందని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమేనని, రుణమాఫీకి కొలబద్ద పాసుపుస్తకమేనని స్పష్టం చేశారు. భూములున్న రైతులు పాసుపుస్తకాలు బ్యాంకులో పెట్టి తెచ్చుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. కొంత మంది దొంగలు చెప్పే మాటలు నమ్మొద్దని రైతులను కోరారు.

Also Read: డైనమిక్ సీఎం అంటూ.. రేవంత్ రెడ్డిపై ఎంపీ రేణుకా చౌదరి ప్రశంసలు

హ‌రీశ్‌రావుకు చురకలు
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హ‌రీశ్‌రావుకు సీఎం రేవంత్ పరోక్షంగా చురకలు అంటించారు. ”రుణమాఫీ చేస్తే.. రాజీనామా చేస్తా అన్నవాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని గుర్తించండి . మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం.. మీ విజ్ఞతకే వదిలేస్తున్నామ”ని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు