డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే రైతు రుణమాఫీ సాధ్యమైంది: ఎంపీ రేణుకా చౌదరి

రైతు రుణమాఫీకి రూ. 6500 కోట్లు ఖర్చు పెడుతున్నామని, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే ఇది సాధ్యమయిందని ఎంపీ రేణుకా చౌదరి ప్రశంసించారు.

డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే రైతు రుణమాఫీ సాధ్యమైంది: ఎంపీ రేణుకా చౌదరి

Renuka Chowdhury Praises CM Revanth Reddy over Farm Loan waiver

Renuka Chowdhury: రైతు రుణమాఫీ ఈరోజు నుంచి అమలు కాబోతుందని, లక్ష రూపాయల పంట రుణాలు వెంటనే మాఫీ అవుతాయని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘురామ్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీకి రూ. 6500 కోట్లు ఖర్చు పెడుతున్నామని, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే ఇది సాధ్యమయిందని ప్రశంసించారు. ఈ స్కీం దేశంలో ఎక్కడా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాను అన్నివిధాల అభివృద్ధి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీయిచ్చారు.

”కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల వల్ల లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. రైతు రుణమాఫీకి వరుణదేవుడు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాడు. రఘురామ్ రెడ్డి, నేను టూరిజం డెవలప్మెంట్ పై దృష్టి పెడతాం. గత ప్రభుత్వం ఏమి చేయలేదు. నేలకొండపల్లిలో బౌద్ధ స్థూపాన్ని గతంలోనే ఏర్పాటు చేశాం. నిరుద్యోగ యువత ఉపాధికి ఇది ఉపయోగపడుతుంది. పాలేరులో రేగట్టా పోటీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తాం.

ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ, వెటర్నరీ కాలేజీ, సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ టూల్ డిజైన్ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఫిషరీస్ డెవలప్మెంట్ నేను గతంలోనే పాలేరులో చేశాను. కేజ్ కల్చర్ ద్వారా జిల్లాలో ఉన్న అన్ని చెరువుల్లో చేపలు పెంచుతాం. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, శాశ్వత భవనాల్లో ఏర్పాటు చేస్తాంజర్నలిస్ట్ లకు సైతం ఇళ్ల స్థలాలు ఇస్తాం. కరీంనగర్ లైబ్రరీ లాగా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. కరీంనగర్ వెళ్లి అది చూసి దాని మోడల్ కడతాం. చక్కటి గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. నా నిధులు ఖమ్మంకి కేటాయిస్తాను. చదువు ఒక ఆస్తి.. దాని కోసం ఏదైనా మా ప్రభుత్వం చేస్తుంది.

Also Read : మాతో పెట్టుకోవద్దు..! అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలు..!

రుణమాఫీపై ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది. ప్రతి నియోజకవర్గం వారీగా రుణమాఫీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తిచేస్తాం. 5 గ్రామ పంచాయితీలకు ఆర్డినెన్సు చేసి తెలంగాణలో కలపాలి. దీని కోసం కేంద్రంపై వత్తిడి తెస్తాం. ఆంధ్ర సీఎంతో మన సీఎం మాట్లాడారు. స్పాంజ్ ఐరన్ కంపెనీకి నిధులు వచ్చేలా చేస్తాం. జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. పంటల ప్రోసేసింగ్ ప్లాంట్ (ఇర్రెడియేటెడ్) పెడతాం. రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తాం. భద్రాద్రి రామయ్య ఆలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామ”ని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు.

Also Read : తీవ్ర ఆవేదనలో కాంగ్రెస్‌ సీనియర్ నేత..! కారణం ఏంటి?

తెలంగాణలో కొత్త అధ్యాయం: ఆదినారాయణ
రైతు రుణమాఫీ తెలంగాణ రైతులకు వరమని, వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తున్నామని అశ్వారావుపేట ఎంఎల్ఏ జారే ఆదినారాయణ అన్నారు. ఇది ఒక కొత్త అధ్యాయమని.. రైతే రాజు, వెన్నెముక అనేది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్మి వారి సంక్షేమానికి పాటు పడుతుంతోందని తెలిపారు.