Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే
ఇది చాలదన్నట్లు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిని మరింత బాధ పెట్టింది.
- జీవన్ రెడ్డితో మాట్లాడిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
- పార్టీ మార్పుపై పునరాలోచన చేయాలని విన్నపం
- తన నిర్ణయంలో మార్పు లేదని తెగేసి చెప్పిన జీవన్ రెడ్డి
Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. కానీ జీవన్ రెడ్డి ఇదే ఫైనల్ నిర్ణయం అని తెగేసి చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దల సూచనలతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డిని కలిశారు. పార్టీ మార్పుపై పునరాలోచన చేయాలని జీవన్ రెడ్డిని కోరారు. అయినా జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారట. దీంతో జీవన్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు.
బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవటం జీవన్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదు. ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జీవన్ రెడ్డి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా సంజయ్ కుమార్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో జీవన్ రెడ్డికి హర్ట్ అయ్యారు. పార్టీ పెద్దల దగ్గర ఎంత మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్న భావనలో ఆయన ఉన్నారు. ఈ పరిణామాలతో కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు జీవన్ రెడ్డి.
ఇది చాలదన్నట్లు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిని మరింత బాధ పెట్టింది. దీంతో ఆయన తన వారిని రెబల్స్ గా నిలబెట్టి మరీ గెలిపించుకున్నారు. ఇలా తీవ్ర అసంతృప్తిలో ఉన్న జీవన్ రెడ్డి తన అనుచరులు, సన్నిహితులతో పాటు ముఖ్య నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ల తో సంప్రదింపులు జరుపుతున్నారని రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.
ఈ నెల 24 లేదా 25 తేదీల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్. ఆయనను బుజ్జగించే బాధ్యతను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అప్పగించింది. జీవన్ రెడ్డితో మాట్లాడిన ఎమ్మెల్యే సత్యం.. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరారు. కానీ జీవన్ రెడ్డి తన నిర్ణయంలో మార్పు లేదు అన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెల 22న ఖాతాల్లోకి డబ్బులు
