Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ‘గోట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
ఎట్టకేలకు గోట్ సినిమా నవంబర్ 12 రిలీజ్ అవుతుంది. (Sudigali Sudheer)
Sudigali Sudheer
Sudigali Sudheer : మ్యాజిక్ షోలు చేసుకుంటూ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఇప్పుడు బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ గా మారి దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ టీవీ షోలతోనే భారీగా అభిమానులు సంపాదించుకున్న సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ మరింత ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే సుధీర్ హీరోగా పలు సినిమాలు రాగా ఇప్పుడు గోట్ అనే సినిమాతో రాబోతున్నాడు.
సుడిగాలి సుధీర్, తమిళ భామ దివ్యభారతి జంటగా తెరకెక్కిన సినిమా గోట్. డైరెక్టర్, నిర్మాత మధ్య, డైరెక్టర్ – హీరోయిన్ మధ్య విబేధాలు రావడంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు గోట్ సినిమా నవంబర్ 12 రిలీజ్ అవుతుంది. సుధీర్ – దివ్యభారతి కలిసి పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకు ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
Also Read : Suriya : పాలిటిక్స్ లోకి ఎంట్రీ పై స్పందించిన సూర్య.. రాజకీయాలు గమనిస్తున్నాను అంటూ..
సుధీర్ గోట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 10 మంగళవారం నాడు సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించబోతున్నారు. ఇదే ఈవెంట్ లో గోట్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి సుడిగాలి సుధీర్, దివ్యభారతితో పాటు మూవీ టీమ్ అంతా హాజరవుతున్నారు.

