Jensen Huang Affair : ఎన్విడియా బాస్‌తో చైనా మహిళ ఎఫైర్.. 4.8 బిలియన్ డాలర్ల చిప్ డీల్ వెనుక అసలేం జరిగింది?
Jensen Huang Affair : 2024 జూన్‌లో తైవాన్ రాజధాని తైపీలో ఓ బార్లో జెన్సన్ హువాంగ్‌తో కలిసి ఆలిస్ కనిపించారు. ఆ తర్వాత 2025 మేలోనూ ఆయనతో కలిసి కనిపించినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ రహస్య నివేదికలో పేర్కొంది.
Alice Huang Jensen Huang
Alice Huang Jensen Huang : ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీ ఎన్విడియా.. ఇప్పుడు ఓ సంచలన వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆ సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. చైనా మహిళ ఆలిస్ హువాంగ్‌తో సంబంధాలు.. మరోవైపు గూఢచర్యం ఆరోపణలు.. వెరసి వ్యవహారం కలకలం రేపుతోంది.
Also Read : Donald Trump : ఓటమి దెబ్బతో బుద్దొచ్చింది..! వలసలపై ట్రంప్ యూటర్న్..?
చైనీస్ గూఢచారిగా భావిస్తున్న అలైస్ హువాంగ్ అలియాస్ హువాంగ్ లీతో తనకు వివాహేతర సంబంధం ఉందని జెన్సన్ హువాంగ్ అంగీకరించారు. ఈ మేరకు ఎన్విడియా సంస్థ ఉద్యోగులకు ఒక ఇ-మెయిల్ పంపించారు. తప్పును ఒప్పుకొంటూ.. తన కుటుంబానికి, సంస్థకు క్షమాపణలు చెప్పారు. సంస్థ అంతర్గత విచారణను ప్రారంభించింది.. దానికి పూర్తిగా సహకరిస్తానని జెన్సన్ పేర్కొన్నారు.
ఎవరీ ఆలిస్ హువాంగ్..? జెన్సన్‌తో పరిచయం ఎలా..
ఆలిస్ హువాంగ్ అసలు పేరు హువాంగ్ లే. ఆమె చైనా పౌరురాలు. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. గతంలో చైనాలో టెలివిజన్ రిపోర్టర్‌గా పనిచేసింది. హునాన్ టీవీ, చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీతో పాటు హెచ్ఎస్బీసీ, సిటిక్ సెక్యూరిటీస్‌లోనూ పనిచేసినట్లు ఆమె ప్రొఫైల్‌లో పేర్కొన్నట్లు ప్రచారంలో ఉంది. 2024 జూన్‌లో తైవాన్ రాజధాని తైపీలో ఓ బార్లో జెన్సన్ హువాంగ్‌తో కలిసి ఆలిస్ కనిపించారు. ఆ తర్వాత 2025 మేలోనూ ఆయనతో కలిసి కనిపించినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ రహస్య నివేదికలో పేర్కొంది.
చైనా గూఢచర్య ఆరోపణలు..
చైనా నిఘా సంస్థ ఆలిస్‌ను నియమించుకుని జెన్సన్ హువాంగ్ నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించినట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చైనీస్ ఇన్వెస్టర్ అయిన ఈమె.. ప్రస్తుతం సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ కంపెనీ ‘మెగాస్పీడ్’లో కీలక హోదాలో పనిచేస్తున్నారు. ఈ సంస్థ గత రెండేళ్లలో సుమారు 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్స్ కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అమెరికా ఆంక్షలు దాటుకుని ఎన్విడియా ఏఐ చిప్‌లను ఈ సంస్థ చైనాకు చేరవేస్తోందనే ఆరోపణలు రావడంతో అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.
