Group 2 Exam Postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ వరకు వాయిదా
TSPSC Group 2 exam: డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోతున్నామని..
- T Venkateshwarlu
- Published On : July 19, 2024 / 03:49 PM IST
TSPSC Group 2 exam
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ వరకు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7 నుంచి జరగాల్సిన విషయం తెలిసిందే. ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. డీఎస్సీ పూర్తి కాగానే గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. దీంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య రెండు రోజులు సమయం ఉండటంతో పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోతున్నామని ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు ఊరట దక్కింది. గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేపట్టిన విషయం విదితమే. అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదాపై సర్కారు నుంచి సానుకూల ప్రకటన వచ్చేలా కృషి చేస్తామని గురువారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా చెప్పారు.
హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో గురువారం నిరుద్యోగులతోనూ ఆయన సమావేశమయ్యారు. కాగా, కొన్ని రోజులుగా అభ్యర్థులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతున్నారు. నోటిఫికేషన్‌లో గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలని అన్నారు. గ్రూప్-2 పరీక్షలు దాదాపు 2 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
Also Read : మైక్రోసాప్ట్ సేవలకు అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, విమానయాన, టెలీకాం రంగాలపై తీవ్ర ప్రభావం
