AP Inter Exams 2027 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. పరీక్ష ఫీజుకు కొత్త డెడ్లైన్!
AP Inter Exams 2027 : ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2027కు హాజరయ్యే విద్యార్థులకు ఊరట లభించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ.1,000 లేట్ ఫీతో నవంబర్ 17 వరకు అవకాశం ఉంది.
AP Inter Exams 2027
- ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2027.. ఫీజు చెల్లింపునకు మరో అవకాశం
- ఏపీ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 10 వరకు ఛాన్స్
- రూ.1000 ఆలస్య రుసుముతో మరో అవకాశం
AP Inter Exams 2027 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బిగ్ రిలీఫ్ లభించింది. 2027లో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. దీంతో ఇప్పటివరకు పరీక్ష రుసుము సమర్పించని విద్యార్థులకు మరో అవకాశం దక్కింది. చివరి తేదీ దాటిపోతుందనే ఆందోళనలో ఉన్నవారికి ఈ నిర్ణయం కొంత రిలీఫ్ అందించనుంది.
ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ప్రకారం.. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా నవంబర్ 10వ తేదీ వరకు పరీక్ష ఫీజు కట్టవచ్చు.. సాధారణ గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయలేని వారికి కూడా అధికారులు వెసులుబాటు కల్పించారు.
Read Also : Hyderabad Heavy Rain : హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం!
రూ.1,000 లేట్ ఫీతో మరో ఛాన్స్ :
నవంబర్ 10లోపు రుసుము చెల్లించలేని విద్యార్థులు ఆందోళన అవసరం లేదు. రూ.1,000 ఆలస్య రుసుము చెల్లించి నవంబర్ 17వ తేదీ వరకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. అయితే, అదనపు భారం పడకుండా ఉండాలంటే ముందుగానే ఫీజు కట్టేయడం బెటర్..
విద్యార్థులు ఏం చేయాలంటే? :
పరీక్షలకు రెడీ అయ్యే అభ్యర్థులు తమ కాలేజీలను సంప్రదించి ఫీజు పేమెంట్ వివరాలను తెలుసుకోవాలి. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోవడం మంచిది.
అలాగే ఫీజు చెల్లింపు విధానం, అవసరమైన వివరాలు, ఇతర మార్గదర్శకాల కోసం కాలేజీ యాజమాన్యం, ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయొచ్చు. ఈ గడువు పొడిగింపు ఇంటర్ విద్యార్థులకు అద్భఉతమైన అవకాశంగా చెప్పవచ్చు.
