ఓఆర్ఆర్‌ దగ్గర ఘోర ప్రమాదం.. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి

కారు అతి వేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Car Hits Lorry (Photo Credit : Google)

Car Hits Lorry : మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కోడా కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కాలేజీ విద్యార్థులు మరణించారు.

అతి వేగంతో స్కోడా కారును నడుపుతూ లారీని ఢీకొట్టారు. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్.. అందరికీ తెలిసిన విషయమే. అతివేగం ప్రాణాంతకం అని తెలిసినా, దాని వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో కళ్లారా చూస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. అత్యంత వేగంగా వాహనాలు నడుపుతూ ఘోర ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత గురించి చెప్పక్కర్లేదు. చేతికి స్టీరింగ్ చిక్కిందంటే చాలు.. యమ స్పీడ్ తో వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అతివేగం అత్యంత ప్రమాదకరం అని పోలీసులు నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా.. ఇంకా కొందరి చెవికి ఎక్కడం లేదు. సరదా కోసం కొందరు, థ్రిల్ కోసం మరికొందరు వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఘటనలోనూ అతివేగమే ప్రమాదానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. స్పీడ్ గా కారు నడుపుతూ కంట్రోల్ కోల్పోయి లారీని గుద్దేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read : పోలీస్‌ను కర్రతో దారుణంగా కొట్టాడు, ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

ట్రెండింగ్ వార్తలు