Pastor Cheating: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం..! హైదరాబాద్లో వెలుగులోకి మరో పాస్టర్ బాగోతం
మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పాస్టర్.. ప్రేమ, పెళ్లి పేరుతో మరో మహిళను ట్రాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
FIR Representative Image (Image Credit To Original Source)
Pastor Cheating: హైదరాబాద్ లో మరో పాస్టర్ బాగోతం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడో పాస్టర్. బాధితురాలి ఫిర్యాదుతో పాస్టర్ సందీప్ వడేగర్ పై జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు సనత్ నగర్ పోలీసులు. అనంతరం ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పాస్టర్.. ప్రేమ, పెళ్లి పేరుతో మరో మహిళను ట్రాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఉప్పల్ లోని లివింగ్ వే చర్చ్ పాస్టర్ గా ఉన్న సందీప్ కు తన స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగినిపై బెదిరింపులకు దిగాడు పాస్టర్. నిందితుడు పాస్టర్ సందీప్ వెనక సికింద్రాబాద్ కు చెందిన మరో చర్చి పాస్టర్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.
Also Read: నాన్న, కొడుకు, ఓ తలకొరివి.. టచ్ చేసే స్టోరీ.. రేపో మాపో ఇలాంటివి మామూలు అయిపోతాయేమో..
