TTD Alert : చిరుత దాడి ఘటనతో టీటీడీ అలర్ట్.. తిరుమల నడక మార్గంలో భద్రత కట్టుదిట్టం

అలిపిరి కాలి నడక మార్గంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 7వ మైలు ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భక్తుల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

TTD tight security

TTD Tight Security Tirumala Nadakadari : తిరుమల నడక మార్గంలో చిరుత చిన్నారిపై దాడి చేసి చంపిన ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలర్ట్ అయింది. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు టీటీడీ భద్రతను కట్టుదిట్టం చేసింది. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్ గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది.

తిరుమల నడక మార్గంలో 100 మంది భక్తుల గుంపును అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. 100 మంది భక్తులను అనుమతించే క్రమంలో అధికారులు రూట్ ను ఏర్పాటు చేశారు. నడకమార్గంలో సెక్యూరిటీ పెంచాలని నిర్ణయించారు. భక్తుల వెంట సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. చిన్నారి లక్షితపై దాడి చేసి చంపేసిన చిరుతను బంధించడానికి మూడు బోన్లు ఏర్పాటు చేశారు.

MLA Nallapareddy : తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి ఘటన.. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బోనులో చిరుత చిక్కుకునే ప్రాంతాలను అధికారులు గుర్తించారు. మరోవైపు అలిపిరి కాలి నడక మార్గంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 7వ మైలు ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భక్తుల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సూచనలు పాటించాలని, గుంపులు గుంపులుగా వెళ్లాలని భక్తులకు సూచించారు.

అలిపిరి మెట్ల మార్గంలో శుక్రవారం రాత్రి బాలిక తప్పిపోయారు. రాత్రి నడకదారిలో 6 ఏళ్ల చిన్నారి లక్షిత తప్పిపోయారు. తిరుమల నడకదారిలో బాలికపై చిరుత దాడి చేసి చంపింది. ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యం అయింది. గతంలో బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం బాలుడిపై చిరుత దాడి చేసి లాక్కెళ్ళింది.

Cheetah Kill Girl : తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసి చంపేసిన చిరుత

మరోవైపు చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత ఘటనపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తనకు కొన్ని అనుమానాలున్నాయని తెలిపారు. ఆడబిడ్డ విషయం కాబట్టి తనకెందుకో అనుమానంగా ఉందన్నారు. బాలిక తల్లిదండ్రులు దినేష్, శశికళను పూర్తిస్థాయిలో విచారణ చేయాలని తెలిపారు.

బాలిక తల్లిదండ్రులపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు, టీటీడీ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాలిక రక్షిత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. బాలికను చిరుత చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది.

ట్రెండింగ్ వార్తలు