హైదరాబాద్‌లో ‘మమ్స్ అన్‌ప్లగ్డ్’ ప్రోగ్రాం.. ఒత్తిడి, నిరాశ, ఆందోళన నుంచి దూరం చేయడానికి..

చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నిత్య, సైకియాట్రిస్ట్‌లు, పీడియాట్రిషియన్‌లు, గైనకాలజిస్ట్‌లు, సైకాలజిస్టులు..

తల్లుల్లో మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించడానికి ఉద్దేశించిన “మమ్స్ అన్‌ప్లగ్డ్” అనే కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ రష్మీ(ల్యాండ్‌మార్క్ వరల్డ్‌వైడ్).. ఎన్జీవో మర్హమ్ రెసొనేటింగ్ రెసిలెన్స్, టోటల్ సొల్యూషన్స్ రిహాబిలిటేషన్ సొసైటీ, టాక్ అండ్ లెర్న్ థెరపీ సెంటర్‌, నయీదిషాతో కలిసి హైదరాబాద్ లో నిర్వహించింది.

ఈ కార్యక్రమం అధిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఇతర మానసిక ఇబ్బందుల వంటి సవాళ్ల మధ్య మాతృమూర్తులు తమ కుటుంబాలలో పోషించే కీలక పాత్రను గుర్తించి, అవసరమైన మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించింది. ప్రభావవంతమైన తల్లులు,మాతాశిశు ఆరోగ్యంలో నిపుణులతో సహా 100 మందికి పైగా పాల్గొన్న ప్రారంభ కార్యక్రమానికి పద్మశ్రీ డా. మంజుల అనగాని, ఆర్జే షెజ్జి వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఎన్జీవో మర్హం వ్యవస్థాపకులు డాక్టర్. నబత్ లఖానీ, చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నిత్య, సైకియాట్రిస్ట్‌లు, పీడియాట్రిషియన్‌లు, గైనకాలజిస్ట్‌లు, సైకాలజిస్టులు, థెరపిస్టుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ‘‘జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎందుర్కొంటూ ముందుకెళ్లడానికి అవసరమైన సాధనాలతో తల్లులను శక్తివంతం చేయడం ‘మమ్స్ అన్‌ప్లగ్డ్’ చొవరతో మా లక్ష్యం’’ అని డాక్టర్ నిత్య అన్నారు.

ఈ ఈవెంట్‌లో మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణపై ఆయా రంగాలలో నిపుణులతో చర్చగోష్టి కార్యకలాపాలు జరిగాయి. టోటల్ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు, సైకాలజిస్ట్ అయిన డాక్టర్ పూజా ఝా మాట్లాడుతూ.. ‘‘ఒంటరి తల్లులు, న్యూరోటైపికల్, న్యూరోడైవర్జెంట్ పిల్లలు ఉన్న తల్లులు తమ అనుభవాలను పంచుకోవడానికి అలాగే, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాము” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా ఆశా హాస్పిటల్, రెయిన్‌బో హాస్పిటల్ కన్సల్టెంట్ పెరినాటల్ సైకియాట్రిస్ట్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీలో ఉమెన్ అండ్ పెరినాటల్ మెంటల్ హెల్త్ కమిటీ సహ ఛైర్‌పర్సన్ డాక్టర్ శ్వేతారెడ్డి ఎస్, సైకియాట్రిస్ట్, డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్‌ డాక్టర్ రవికాంత్, డాక్టర్ ప్రతిమ గిరి, డాక్టర్ సనా స్మృతి కూడా తమ నైపుణ్యాలను పంచుకొని చర్చలను మరింత మెరుగుపరచడానికి దోహదం చేశారు.

Also Read : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!

ట్రెండింగ్ వార్తలు