Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!

Mental Health Study : 12శాతం మంది పురుషులతో పోలిస్తే.. 18శాతం మంది మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు అధికంగా కష్టపడుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!

Indian women are more stressed than men ( Image Source : Google )

Updated On : July 20, 2024 / 12:10 AM IST

Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం ఇప్పటికే అనేక మందిలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టుగా ధృవీకరించింది. ముఖ్యంగా భారత్‌లో వర్క్ చేసే స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. “ఎమోషనల్ వెల్‌నెస్ స్టేట్ ఆఫ్ ఎంప్లాయీస్” పేరుతో లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. యువర్‌దోస్ట్ 5వేల కన్నా ఎక్కువ మంది భారతీయ నిపుణులను సర్వే చేసింది.

Read Also : IT Employees Health Issues : డేంజర్‌లో టెకీలు.. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం

ఈ కార్యాలయంలో ఒత్తిడికి సంబంధించిన కొన్ని విషయాలను గుర్తించింది. 5వేల కన్నా ఎక్కువ మంది ప్రతివాదుల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత మానసిక ఆరోగ్య ప్లాట్‌ఫారమ్ యువర్‌డోస్ట్ పని ప్రదేశాలలో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లు కనుగొన్నారు.

18శాతం మహిళల్లో తీవ్ర మానసిక ఒత్తిడి :
దాదాపు మూడు వంతులు లేదా 72.2శాతం మంది మహిళా ప్రతివాదులు అధిక ఒత్తిడి స్థాయిలను నివేదించారు. దీనికి విరుద్ధంగా, పురుషులను అదే ప్రశ్న అడిగినప్పుడు.. వారిలో 53.64శాతం మంది అధిక ఒత్తిడి స్థాయిలను అనుభవిస్తున్నారని చెప్పారు. అధిక శాతం స్త్రీలు కూడా పనిపరంగా జీవిత సమతుల్యత లోపాన్ని నివేదించారు.

12శాతం మంది పురుషులతో పోలిస్తే.. 18శాతం మంది మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు అధికంగా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అధిక పనిభారం కలిగిన మహిళల్లో ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇందులో పనికి తగిన గుర్తింపు లేకపోవడం, తక్కువ నైతికత, భయాందోళనలు వంటివి ఉన్నాయి. 9.27శాతం ​​మంది పురుషులతో పోలిస్తే.. 20శాతం మంది మహిళలు ఎల్లప్పుడూ తీవ్ర ఒత్తిడిని కలిగి ఉన్నట్లు నివేదించారు.

అత్యంత ఒత్తిడికి లోనైన వయస్సు గ్రూపులివే :
ఉద్యోగుల ఎమోషనల్ వెల్‌నెస్ స్టేట్ నివేదిక ప్రకారం.. 21 ఏళ్ల వయస్సు నుంచి 30 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న ఉద్యోగులు, కార్మికులలో అత్యంత ఒత్తిడికి గురవుతున్నారు. 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల 64.42శాతం మంది కార్మికులు అధిక స్థాయి ఒత్తిడిని అనుభవిస్తున్నట్లు నివేదించారు. 31 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల 59.81శాతం మంది ఉద్యోగులు ఇదే ఫాలో అయ్యారు. తక్కువ ఒత్తిడికి గురైన వయస్సు సమూహం 41 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలు.

అయితే, 53.5శాతం మంది ఉద్యోగులు మాత్రమే అధిక స్థాయి కార్యాలయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. “వర్క్‌ప్లేస్ డైనమిక్స్‌లో మార్పు, రిమోట్, హైబ్రిడ్ వర్క్ మోడల్స్ పరిణామం, 21ఏళ్ల నుంచి 30 ఏళ్ల జనాభాపై ప్రభావం చూపింది. సంస్థలు రెగ్యులర్ కమ్యూనికేషన్, ఎంగేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’’ చీఫ్ సైకాలజీ ఆఫీసర్ డాక్టర్ జిని గోపీనాథ్ అన్నారు. ఐటీ, తయారీ, రవాణా, సిబ్బంది, నియామకాలు, టెక్, మీడియా, న్యాయ సేవలు, వ్యాపార సలహా, సేవలు మరిన్ని రంగాలలోని ఉద్యోగులను సర్వే చేసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!