Diabetes: చైనా శాస్త్రవేత్తల అద్భుత సృష్ఠి.. స్టెమ్ సెల్ థెరపీతో డయాబెటీస్ కి చెక్.. ఇక మందులు వాడాల్సిన అవసరం లేదు
స్టెమ్ సెల్ థెరపీతో డయాబెటీస్(Diabetes) కి చెక్ పెట్టిన చైనా శాస్త్రవేత్తలు.
China scientists succeed to control diabetes with stem cell therapy.
Diabetes: డయాబిటీస్ అనేది ఎంత ప్రమాదకరంగా మారుతోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం జనరేషన్ లో చాలా వేంగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి కూడా ఇదే అవడం విశేషం. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఈ మహమ్మారి ప్రతీ ఒక్కరిని పట్టి పీడిస్తోంది. అయితే, ఈ డయాబెటీస్ కంట్రోలింగ్ కోసం చాలా రకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించేలా సాఫల్యం సాధించలేకపోయారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం చైనా శాస్త్రవేత్తలు ఈ దిశగా పురోగతి సాదించినట్టుగా తెలుస్తోంది. అదేంటంటే, స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 2 డయాబెటీస్ ను సైతం నయం చేయొచ్చని వారు నిర్ధారించారు. ఈ దిశగా జరిగిన పరిశోధనల్లో వారు విజయం సాదించినట్టుగా తెలియజేశారు. చాలా కాలంగా ఇన్సులిన్ మీద ఆధారపడిన వ్యక్తి యొక్క సహజ ఇన్సులిన్ ఉత్పత్తిని పునరుద్ధరించడానికి రూపొందించిన ల్యాబ్-ఇంజనీరింగ్ ప్యాంక్రియాటిక్ కణాల మార్పిడి చేశారు.
Delhi: ఈడీ అధికారిగా వచ్చిన పనిమనిషి.. కంగుతిన్న యజమాని.. చివర్లో సినిమా లెవల్ ట్విస్ట్
దాని వల్ల వ్యక్తి ఇప్పుడు ఇన్సులిన్ లాంటివి తీసుకోవడం మానేశాడట. ఇది ఇది వైద్య చెరిత్రలో పెద్ద పురోగతిగా వారు చెప్తున్నారు. పెద్ద క్లినికల్ ట్రయల్స్‌లో జరిగి మంచి ఫలితాలు వస్తే మాత్రం ఇది డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సను పూర్తిగా మార్చగలదు. అలాగే, ఇకముందు డయాబెటీస్ కి మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.
అయితే, ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య నిపుణులు మాత్రం జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. ఇలాంటి ప్రయోగాల ఫలితం ప్రారంభ దశలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది టైప్ 2 డయాబెటిస్ పేషేంట్స్ లో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పడానికి లేదు. అంటున్నారు. కాబట్టి, ఈ ప్రక్రియకు ఇంకా క్లినికల్ ట్రయల్స్ అవసరం అని వారు సూచిస్తున్నారు.
