Delhi: ఈడీ అధికారిగా వచ్చిన పనిమనిషి.. కంగుతిన్న యజమాని.. చివర్లో సినిమా లెవల్ ట్విస్ట్
ఢిల్లీ(Delhi)లో ఫేక్ ఈడీ ఆఫీసర్ అరెస్ట్.
Fake ED officer arrested in Delhi
Delhi: సినిమాల్లో నకిలీ అధికారులుగా వచ్చి మోసం చేసి డబ్బులు కాజేసే సీన్స్ మనం చాలానే చూసి ఉంటాం. కానీ, అలాంటి సంఘటన నిజంగా జరిగితే మాత్రం అవాక్కవుతాం. కానీ, ఇలాంటి సంఘటన ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. ఈడీ అధికారులుగా ఓ ఇంట్లోకి వచ్చిన కేటుగాళ్ళు భారీగా నగదును దోచుకుపోయారు. తీరా వారు నకిలీ అధికారులు అని తెలిసి భాదితులు లబోదిబోమనన్నారు. అదే విషయాన్ని పోలీసులు తెలియజేయగా దర్యాప్తు చేపట్టారు.
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్.. తిరుమలలో నకిలీ దందా.. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన
ఇంతకు అసలు విషయం ఏంటంటే, ఢిల్లీ(Delhi)లోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని ఒక ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఒక వ్యక్తి ఏకంగా యజమాని ఇంటికే కన్నం వేయాలని చూశాడు. అనుకున్నదే తడవుగా.. స్నేహితులతో కలిసి ‘స్పెషల్ 26’ సినిమాలో మాదిరి పక్కా ప్లాన్ వేశాడు. ఈడీ అధికారిగా యూనిఫామ్లు ధరించి ఇంట్లోకి వచ్చి ఖరీదైన వస్తువులు, భారీగా నగదు దోచుకుపోయారు.
అనుమానం వచ్చిన యజమాని ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సిటీ అంతా జల్లెడ పట్టారు. ఏకంగా 350 సీసీ కెమెరాలను వెతికి మొత్తానికి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నగదు, ఖరీదైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
Delhi | Two persons, including a housemaid, have been arrested for allegedly conspiring to stage a fake Enforcement Directorate raid at her employer’s residence. The arrests were made within 24 hours by the persistent efforts of the Police Station New Friends Colony. The maid,… pic.twitter.com/luIEfHMV63
— ANI (@ANI) February 26, 2026
