2023 Hyundai Alcazar Booking : కొత్త ఇంజిన్‌తో హ్యుందాయ్ అల్కాజార్ కారు.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

2023 Hyundai Alcazar Booking : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇప్పుడే బుకింగ్ చేసుకోండి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ నుంచి కొత్త ఇంజిన్‌తో హ్యుందాయ్ అల్కాజార్ కారు వచ్చేస్తోంది. వెన్యూ, క్రెటా, అల్కాజార్, టక్సన్ వంటి స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను (SUVs) విక్రయిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, 2023 హ్యుందాయ్ అల్కాజార్ బుకింగ్‌లను ప్రారంభించింది. 6/7-సీటర్ మోడల్ సరికొత్త 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్ కొన్ని ఫీచర్ అప్‌డేట్‌లను పొందుతుంది.

హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్ లేదా కంపెనీ సిగ్నేచర్ అవుట్‌లెట్‌ల ద్వారా రూ. 25వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించి కొత్త హ్యుందాయ్ అల్కాజర్‌ను బుక్ చేసుకోవచ్చు. 2023 ఆల్కాజర్‌లో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ (160PS, 253Nm),1.5-లీటర్ CRDi డీజిల్ (116PS, 250Nm). పెట్రోల్ మిల్లును 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ DCTతో వచ్చింది. అయితే, డీజిల్ మోటార్ 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT టార్క్ కన్వర్టర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.

2023 Hyundai Alcazar bookings open, gets new engine

Read Also : Xiaomi 13 Pro Launch : సరికొత్త డిజైన్‌తో షావోమీ 13ప్రో సిరీస్ లాంచ్.. టాప్ ఫీచర్లు ఇవే.. భారత్‌లో ధర ఎంత? సేల్ డేట్ ఎప్పుడంటే?

రెండు ఇంజన్ ఆప్షన్లలో రాబోయే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. E20 ఇంధనానికి సిద్ధంగా ఉన్నాయి. హ్యుందాయ్ అల్కాజార్ లైనప్ నుంచి 2.0-లీటర్ MPi పెట్రోల్ మిల్లు (159PS,191Nm)ని నిలిపివేసింది. కొత్త Alcazar మైలేజ్ 1.5-లీటర్ Turbo GDi పెట్రోల్ మాన్యువల్‌కు 17.5kmpl, 1.5-లీటర్ Turbo GDi పెట్రోల్ ఆటోమేటిక్ 18kmplగా ఉంటుంది. కొత్త ఇంజన్ కాకుండా 2023 హ్యుందాయ్ అల్కాజర్ కొత్త గ్రిల్‌ను పొందింది. అంతేకాకుండా, హ్యుందాయ్ పుడ్ల్ ల్యాంప్ లోగోను అప్‌గ్రేడ్ చేసింది.

ఇప్పుడు ‘ALCAZAR’ ఐకాన్ కలిగి ఉంది. అలాగే, కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను (డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్) స్టాండర్డ్‌గా కలిగి ఉంది. స్టాండర్డ్‌గా చేసిన మరో ఫీచర్ ఐడిల్ స్టాప్ అండ్ గో, అవుట్‌గోయింగ్ మోడల్ ధర రూ. 16.10 లక్షల నుంచి రూ. 21.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 2023 హ్యుందాయ్ అల్కాజార్ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ టాటా సఫారీ, మహీంద్రా XUV700, MG హెక్టర్ ప్లస్ వంటి వాటికి పోటీదారుగా మార్కెట్లో దూసుకెళ్తోంది.

Read Also : Citroen e-C3 Launch : సిట్రోయెన్ e-C3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ వచ్చేసింది.. ఏ కారు ధర ఎంతో తెలుసా? ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు