Citroen e-C3 Launch : సిట్రోయెన్ e-C3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ వచ్చేసింది.. ఏ కారు ధర ఎంతో తెలుసా? ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

Citroen e-C3 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో e-C3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి.

Citroen e-C3 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో e-C3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి. ముందుగానే 25వేల ధరతో కారు బుకింగ్‌లు చేసుకోవచ్చు. e-C3 మోడల్ టాప్ స్పీడ్ పరిధి 320కిమీ (ARAI) ఉండగా.. టాటా టియాగో AV కన్నా టాప్ స్పీడ్ కలిగి ఉంటుంది. Citroen e-C3 మోడల్ 29.3kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది.

ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ 57bhp ఎలక్ట్రిక్ మోటారుకు పవర్ ఇస్తుంది. e-C3 కారు 6.8 సెకన్లలో 107kmph గరిష్ట వేగంతో 0 నుంచి 60kmph వరకు దూసుకెళ్లగలదు. ఇందులో రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, స్టాండర్డ్ కారు రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను కూడా అందిస్తుంది. సిట్రోయెన్ (ARAI) పరిధి 320కి.మీ అయితే.. 57 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని నింపవచ్చు. అందుకు DC ఛార్జర్‌ని ఉపయోగించవచ్చు. 3.3kW AC ఛార్జర్ బ్యాటరీని 10 నుంచి 100 శాతం వరకు నింపేందుకు 10.5 గంటలు సమయం పడుతుంది.

Citroen e-C3 launched at Rs 11.50 lakh

Read Also :  WhatsApp Schedule Group Call : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై గ్రూపు కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

సిట్రోయెన్ e-C3 ధరలు (ఎక్స్-షోరూమ్) :

Citroen e-C3 లైవ్ – 11.50 లక్షలు
సిట్రోయెన్ ఇ-సి3 ఫీల్ – రూ. 12.13 లక్షలు
సిట్రోయెన్ ఇ-సి3 ఫీల్ వైబ్ ప్యాక్ – రూ. 12.28 లక్షలు
సిట్రోయెన్ ఇ-సి3 ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ – రూ. 12.43

అధిక స్పెక్ ఫీల్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో 10.2-అంగుళాల టచ్ డిస్‌ప్లే, నాలుగు-స్పీకర్ ఆడియో, మైసిట్రోయెన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, Citroen బ్యాటరీపై 7 ఏళ్లు /1,40,000km, మోటారుపై 5 ఏళ్లు/1,00,000km, వాహనంపై 3 ఏళ్లు/1,25,000km వారంటీని అందిస్తోంది.

Read Also : Xiaomi 13 Pro Launch : సరికొత్త డిజైన్‌తో షావోమీ 13ప్రో సిరీస్ లాంచ్.. టాప్ ఫీచర్లు ఇవే.. భారత్‌లో ధర ఎంత? సేల్ డేట్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు