తీవ్ర విషాదం.. సీరియల్ నటుడు ఆత్మహత్య, పవిత్ర పిలుస్తోంది అంటూ..

ఇటీవలే రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర జయరాం చనిపోవడంతో అప్పటి నుంచి చందు తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు.

Serial Actor Chandu Ends Life : తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి పవిత్ర జయరాం ప్రియుడు, సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. మణికొండలోని తన నివాసంలో నటుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర పుట్టిన రోజున పవిత్ర తనను రమ్మంటోంది అంటూ.. శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేసిన చందు.. అనంతరం బలవన్మరణం చేసుకున్నాడు.

త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో చందు నటించాడు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు చందు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని ఓ యూట్యూబ్ ఛానల్ లో చందు వెల్లడించాడు.

చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉంది. కొంత కాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర జయరాం చనిపోవడంతో అప్పటి నుంచి చందు తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో చందు యాక్ట్ చేస్తున్నాడు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. చందు ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తున్నారు. కాగా.. 5 రోజుల క్రితం మహబూబ్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందింది.

 

 

ట్రెండింగ్ వార్తలు