Andhra Pradesh : ఏపీలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
Andhra Pradesh : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.
West Godavari Car Accident
Andhra Pradesh : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు గల్లంతవ్వగా.. ఒకరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
Also Read : CM Chandrababu Naidu : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే..!
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెరవలిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతయ్యారు. అదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఓగిడి గ్రామం నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతయిన పోతుల లక్ష్మీభాను (18), రాజారాం (17), నాగిరెడ్డి దుస్వంత(18), సాయి సూర్య (19) కోసం స్థానికుల సహాయంతో గాలిస్తున్నారు. మరోవైపు.. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
