SIT On Poll Violence : ఏపీలో ఎన్నికల హింసపై 13మందితో సిట్ ఏర్పాటు.. సభ్యులు వీరే

సీఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు.

SIT On Poll Violence : ఏపీలో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తం 13 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీపీ వినీత్ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలో సిట్ పని చేయనుంది. సీఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు.

SIT సభ్యులు
* ఏసీబీ ఎస్పీ రమాదేవి
* ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత
* ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి
* సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులు
* ఏసీబీ డీఎస్పీ (ఒంగోలు) వల్లూరి శ్రీనివాస రావు
* ఏసీబీ డీఎస్పీ (తిరుపతి) రవి మనోహర చారి
* గుంటూరు రేంజ్ ఇన్ స్పెక్టర్ వి.భూషణం
* విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్ స్పెక్టర్ కే.వెంకటరావు
* ఏసీబీ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ
* ఏసీబీ ఇన్ స్పెక్టర్ జీఐ. శ్రీనివాస్
* ఒంగోలు పీటీసీ మోయిన్
* అనంతపురం ఏసీబీ ప్రభాకర్
* ఏసీబీ ఇన్ స్పెక్టర్ శివ ప్రసాద్

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ చేయనుంది. ఆయా ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించనుంది. ఇప్పటికే నమోదైన కేసుల్లో అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు పెట్టడానికి తగిన ప్రతిపాదనలు చేయనుంది. అవసరమైన చోట కొత్తగా ఎఫ్ఐఆర్ ల నమోదుకు సూచనలు చేయనుంది సిట్. రెండు రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సిట్ నివేదిక ఆధారంగా హింసాత్మక ఘటనల వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోనుంది సీఈసీ.

 

ట్రెండింగ్ వార్తలు