WhatsApp Schedule Group Call : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై గ్రూపు కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp Schedule Group Call : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో గ్రూపు కాల్స్ ఈజీగా షెడ్యూల్ చేసుకోవచ్చు.

WhatsApp Schedule Group Call : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో గ్రూపు కాల్స్ ఈజీగా షెడ్యూల్ చేసుకోవచ్చు. గ్రూపు వాయిస్ కాల్స్ లేదా వీడియో కాల్స్ రెండింటిని షెడ్యూల్ చేసేందకు యూజర్లకు అనుమతిస్తుంది. ఇప్పటివరకూ వాట్సాప్‌లో గ్రూప్ చాట్, వాయిస్, వీడియో కాల్ ద్వారా ఎక్కువ మంది వ్యక్తులతో కలిసి కనెక్ట్ కావడానికి WhatsApp యూజర్లకు అనుమతిస్తుంది.

మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఇటీవల గ్రూప్ వీడియో కాల్ పరిమితిని 32 మంది పాల్గొనేవారికి పెంచిన సంగతి తెలిసిందే. వాట్సాప్ యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కాల్ లింక్స్ కొత్త ఫీచర్‌ను కూడా చేర్చింది. ఇప్పుడు వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత డెవలప్ చేసేందుకు వాట్సాప్ తమ యూజర్లను గ్రూప్ కాల్‌లను షెడ్యూల్ చేసేందుకు అనుమతించే కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకువస్తుంది.

WAbetainfo ప్రకారం.. వాట్సాప్ కొత్త (Schedule Group Call) ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ టీమ్ కాల్‌ని ముందే ప్లాన్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. ఆపిల్ (Apple) TestFlight ప్రోగ్రామ్ కోసం రిజిస్టర్ చేసుకున్న యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ బీటా ప్రోగ్రామ్‌లో భాగమైన ఐఫోన్ యూజర్లు (iOS 23.4.0)తో WhatsAppని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా తమ iPhoneలలో ఈ కొత్త ఫీచర్‌ను యాక్సస్ చేసుకోవచ్చు.

వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత గ్రూప్ చాట్‌లలోని కాల్ బటన్‌ను Tap చేయాల్సి ఉంటుంది. కొత్త మెనులో మీకు ‘Schedule Call’ బటన్ కనిపిస్తుంది. షెడ్యూల్ చేసిన కాల్ ఆప్షన్‌లతో WhatsApp గ్రూప్ కాల్‌ని ఎప్పుడు ప్రారంభించాలో ఎంచుకోవచ్చు. షెడ్యూల్ చేసిన కాల్‌కి పేరును కూడా సెట్ చేసుకోవచ్చు.

Read Also : WhatsApp Upcoming Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై పంపిన మెసేజ్‌లను కూడా ఎడిట్ చేయొచ్చు..!

గ్రూపు కాల్‌ల కోసం షెడ్యూల్ ఆప్షన్ ఈజీ ప్లాన్ మీటింగ్స్ కూడా వర్తిస్తుంది. వాట్సాప్ షెడ్యూల్ కాల్‌కు క్యాప్షన్ ఇవ్వడం ద్వారా మీటింగ్ టాపిక్‌ను ముందే సెట్ చేసుకోవచ్చు.సమావేశంలో చేరమని గ్రూప్ పార్టిసిపెంట్‌లను ముందుగానే గుర్తు చేయడంతో పాటు ఆ తర్వాత యూజర్లకు కాల్ లింక్‌లను షేర్ చేయడంలో ఇబ్బందిని నివారించవచ్చు.

WhatsApp releases new schedule group call feature for iOS beta users

ఆపై కాల్ లింక్ ద్వారా షెడ్యూల్ కాల్ ప్రారంభమవుతుంది. గ్రూప్ కాల్‌ని షెడ్యూల్ చేసిన తర్వాత గ్రూప్ సభ్యులందరూ సెట్ చేసిన సమయంలో గ్రూప్ కాల్‌లో చేరడానికి నోటిఫికేషన్ పొందుతారు. ఈ ఫీచర్ వీడియో, ఆడియో కాల్స్ రెండింటికీ పని చేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నప్పటికీ, యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లలో Android, డెస్క్‌టాప్ యూజర్లు సహా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

వాట్సాప్ iOS వినియోగదారుల కోసం సరికొత్త యాప్ అప్‌డేట్‌ను లేటెస్టుగా రిలీజ్ చేసింది. iOS యూజర్ల కోసం WhatsApp వెర్షన్ 23.3.77 వీడియో కాల్‌ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్, క్యాప్షన్‌తో డాక్యుమెంట్‌లను పంపగల సామర్థ్యం, మరిన్నింటితో సహా అనేక కొత్త ఫీచర్లను అందిస్తుంది.

iOS పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ : ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ ద్వారా మల్టీటాస్క్ చేసేందుకు ఇతర యాప్‌లను చెక్ చేయడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా, PIP మోడ్ ఇప్పటికే Android యూజర్లకు అందుబాటులో ఉంది.
– డాక్యుమెంట్‌ల కోసం క్యాప్షన్ : ఇమేజ్‌లు, వీడియోలకు క్యాప్షన్‌లను యాడ్ చేసినట్టే.. ఈ కొత్త అప్‌డేట్ డాక్యుమెంట్లను పంపే ముందు వాటికి క్యాప్షన్‌లను యాడ్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.
– లాంగ్ గ్రూప్ సబ్జెక్ట్‌లు, డిస్ర్కప్షన్ సపోర్టు : ఈ అప్‌డేట్ వాట్సాప్ యూజర్ల గ్రూప్ ఉద్దేశాన్ని దాని సభ్యులందరికీ వివరించడాన్ని సులభతరం చేస్తుంది.
– Personalised Avatar : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అవతార్‌ల మాదిరిగానే, ఇప్పుడు యూజర్ల కోసం వాట్సాప్‌లో వారి సొంత అవతార్‌ను క్రియేట్ చేయొచ్చు. స్టిక్కర్లు, ప్రొఫైల్ ఫొటోలుగా ఉపయోగించవచ్చు.

Read Also : ChatGPT Whatsapp : వాట్సాప్‌లో మెసేజ్‌ చేయడం మీకు నచ్చదా? ఈ ChatGPT టూల్.. మీ వాట్సాప్ మెసేజ్‌లకు అదే ఆన్సర్ ఇస్తుంది తెలుసా?

ట్రెండింగ్ వార్తలు