Shubman Gill : క్ర‌మశిక్ష‌ణా చ‌ర్య‌లు..? ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శ‌ర్మ‌ను అన్‌ఫాలో.. గిల్ స్పంద‌న..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా సూప‌ర్‌-8కి చేరుకున్నాక‌ ట్రావెలింగ్ రిజ‌ర్వ్‌గా వెళ్లిన శుభ్‌మ‌న్ గిల్, అవేశ్ ఖాన్‌ల‌ను భార‌త్‌కు పంపిన సంగ‌తి తెలిసిందే.

Shubman Gill insta post : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా సూప‌ర్‌-8కి చేరుకున్నాక‌ ట్రావెలింగ్ రిజ‌ర్వ్‌గా వెళ్లిన శుభ్‌మ‌న్ గిల్, అవేశ్ ఖాన్‌ల‌ను భార‌త్‌కు పంపిన సంగ‌తి తెలిసిందే. వారిద్ద‌రిని ఇంత స‌డెన్‌గా ఎందుకు పంపారో అన్న చ‌ర్చ మొద‌లైంది. గిల్ పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకొన్నారని కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, మేనేజ్‌మెంట్‌తో కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇలా జ‌రిగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో గిల్ ఇక టీమ్ఇండియా త‌రుపున ఆడ‌డా? అని అత‌డి అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

కాగా.. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే గిల్‌ను వెన‌క్కి పంపామ‌ని ఇప్ప‌టికే టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ చెప్పాడు. అయినా కానీ రూమ‌ర్లు ఆగ‌లేదు. అదే స‌మ‌యంలో భార‌త్‌కు వ‌చ్చిన గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శ‌ర్మ‌ను అన్‌ఫాలో చేశాడ‌ని, భార‌త జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డంతోనే గిల్ ఇలా చేశాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇది క్రికెట్ వ‌ర్గాల్లోనూ హాట్ టాఫిక్‌గా మారింది.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచక‌ప్‌ సూపర్ -8లో ఆడే జట్ల వివరాలు.. మ్యాచ్‌ల‌ పూర్తి షెడ్యూల్ ఇదే..

కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శ‌ర్మ‌ను అన్‌ఫాలో చేశాడ‌నే వార్త‌ల మ‌ధ్య గిల్ స్పందించాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో రోహిత్ శ‌ర్మ త‌న కూతురు స‌మైరా ఎత్తుకుని ఉండ‌గా.. రోహిత్‌, గిల్ లు ఒక‌రి భుజాల‌పై మ‌రొక‌రు చేతులు వేసుకుని క‌నిపించారు. రోహిత్ శ‌ర్మ ద‌గ్గ‌ర నుంచి తాను, స‌మైరా క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకుంటున్న‌ట్లు గిల్ రాసుకొచ్చాడు.

రోహిత్‌ను అన్‌ఫాలో చేశార‌నే వార్త‌ల మ‌ధ్య గిల్ ఫోటో పోస్ట్ చేయ‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవు అనే విష‌యాన్ని, హిట్‌మ్యాన్ ను అన్‌ఫాలో చేయ‌లేదు అని దీని ద్వారా చెప్ప‌క‌నే చెప్పాడు.

క్లారిటీ వచ్చేసింది.. ఉత్కంఠభరిత పోరులో విజయంతో సూపర్ -8లోకి దూసుకొచ్చిన బంగ్లాదేశ్ జట్టు

ట్రెండింగ్ వార్తలు