Nikhil Siddhartha : హీరో నిఖిల్ కొడుకు పేరేంటో తెలుసా? ఈవెంట్లో లీక్ చేసేసిన నిఖిల్..

తాజాగా హీరో నిఖిల్ తన కొడుకు పేరుని రివీల్ చేశాడు.

Nikhil Siddhartha : హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు నిఖిల్. త్వరలోనే స్వయంభు సినిమాతో పలకరించబోతున్నాడు. అయితే నిఖిల్ కి ఇటీవల బాబు పుట్టిన సంగతి తెలిసిందే.

నిఖిల్ పల్లవి అనే డాక్టర్ ని ప్రేమించి 2020లో కరోనా సమయంలో సింపుల్ గా వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి ఇటీవల ఫిబ్రవరి 21న మగబిడ్డ పుట్టాడని అధికారికంగా తెలిపారు. నిఖిల్ తనయుడి బారసాల ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. కానీ నిఖిల్ తన కొడుకుకి ఏ పేరు పెట్టాడు అనేది మాత్రం చెప్పలేదు.

Also Read : Darshana : మలయాళ కుట్టి, హృదయం ఫేమ్ ‘దర్శన’ గుర్తుందా..? ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ..

తాజాగా నిఖిల్ తన ఫ్రెండ్, హీరో వరుణ్ సందేశ్ ‘నింద’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో నిఖిల్ మాట్లాడుతూ.. వరుణ్, వితిక బ్యూటిఫుల్ కపుల్. త్వరలోనే వీళ్ళు ఒక బేబీని కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. నాకు రీసెంట్ గానే బాబు పుట్టాడు. వాడి పేరు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. వాడి పేరు ‘ధీర సిద్దార్థ‘.. అంటూ తన కొడుకు పేరుని తెలిపాడు నిఖిల్. దీంతో నిఖిల్ అభిమానులు ‘ధీర సిద్ధార్థ’ పేరుని వైరల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు