Babar Azam : ఓదార్పు విజ‌యం.. పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం కీల‌క వ్యాఖ్య‌లు.. ఇంటికెళ్లాక‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాకిస్తాన్ జ‌ట్టు త‌న ప్ర‌యాణాన్ని విజ‌యంతో ముగించింది.

Pakistan captain Babar Azam : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాకిస్తాన్ జ‌ట్టు త‌న ప్ర‌యాణాన్ని విజ‌యంతో ముగించింది. గ్రూపు ద‌శ‌లో త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ పై మూడు వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు చేసింది. అనంత‌రం కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (34 బంతుల్లో 32 నాటౌట్‌) రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ 18.5 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అమెరికా, భార‌త్ జ‌ట్ల చేతిలో ఓడ‌డంతో పాకిస్తాన్ ఈ సారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్క‌మించింది. కాగా.. పాక్ జ‌ట్టు త‌దుప‌రి ద‌శ‌కు క్వాలిఫై కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై కెప్టెన్ భాబ‌ర్ ఆజాం మాట్లాడాడు. ఐర్లాండ్ పై పాకిస్తాన్ విజ‌యం సాధించిన అనంత‌రం మీడియాతో బాబ‌ర్ మాట్లాడాడు. ‘అవును మేము గొప్ప‌గా ముగించాం. ప్రారంభంలోనే వికెట్లు తీసి ప్ర‌త్య‌ర్థిని ఒత్తిడిలోకి నెట్టాము. అయితే.. బ్యాటింగ్‌లో మా పూర్తి సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయాం. వ‌రుస‌గా వికెట్లు కోల్పోయాం. అయితే.. ఆఖ‌రి వ‌రుస బ్యాటర్లు చ‌క్క‌ని స‌హ‌కారం అందించారు.’ అని బాబ‌ర్ ఆజాం అన్నాడు.

Shubman Gill : క్ర‌మశిక్ష‌ణా చ‌ర్య‌లు..? ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శ‌ర్మ‌ను అన్‌ఫాలో.. గిల్ స్పంద‌న..

కాగా.. అమెరికాలోని ప‌రిస్థితులు బౌల‌ర్ల‌కు ఎంతో అనుకూలంగా ఉన్నాయ‌న్నాడు. అమెరికా, భార‌త్‌తో జ‌రిగిన మ్యాచుల్లో బౌల‌ర్లు రాణించిన‌ప్ప‌టికి బ్యాటింగ్ విభాగంలో త‌ప్పులు చేయ‌డంతోనే మ్యాచుల్లో ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నాడు. కెప్టెన్‌గా త‌న భ‌విష్య‌త్తుపై ఖ‌చ్చిత‌మైన స‌మాధానం చెప్ప‌న‌ప్ప‌టికీ.. జ‌ట్టులో భారీ మార్పులు అవ‌స‌రం అని అన్నాడు. జ‌ట్టులో మంచి ఆట‌గాళ్లు ఉన్నార‌ని, ఎక్క‌డ త‌ప్పులు చేశామో ఇంటికి వెళ్లాక స‌మీక్షించుకుంటామ‌న్నాడు. మొత్తానికి ఓ జ‌ట్టుగా విఫ‌లం అయిన‌ట్లు చెప్పాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది మాట్లాడుతూ.. టోర్నమెంట్‌లో తాము సరైన బ్రాండ్ క్రికెట్ ఆడలేదని చెప్పాడు. ఇది క‌ఠిన‌మైన ఫ‌లితం అని అన్నాడు. కొన్ని రంగాల్లో మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచక‌ప్‌ సూపర్ -8లో ఆడే జట్ల వివరాలు.. మ్యాచ్‌ల‌ పూర్తి షెడ్యూల్ ఇదే..

ట్రెండింగ్ వార్తలు