Sanvi Sudeep : కిచ్చ సుదీప్ కూతుర్ని చూశారా? సింగర్‌గా దూసుకుపోతూ..

సుదీప్.. ప్రియా అనే నటిని 2001లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శాన్వి అనే కూతురు ఉంది.

Sanvi Sudeep : కిచ్చ సుదీప్ ఈగ సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయమైనా కన్నడలో మాత్రం స్టార్ హీరో. కన్నడలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు సుదీప్. సుదీప్ కి సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు సుదీప్ కూతురు కూడా ఫేమస్ అవుతుంది. సుదీప్.. ప్రియా అనే నటిని 2001లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శాన్వి అనే కూతురు ఉంది.

Also Read : Kalki Pre Release Event : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు స్టార్ హీరోలు కూడా..

ప్రస్తుతం సుదీప్ కూతురు శాన్వి సుదీప్ కి 20 ఏళ్ళు. శాన్వి సింగర్ గా దూసుకుపోతుంది. ముందు నుంచి సింగింగ్ వైపే తన ప్రయాణం సాగించింది. ఇప్పటికే కన్నడలో పలు సినిమాలకు పాటలు పాడింది, కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది శాన్వి. స్టార్ హీరో కూతురుగా శాన్వి ఇప్పటికే పాపులర్ అవ్వగా ఇప్పుడు సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. దీంతో శాన్విని సుదీప్ అభిమానులతో పాటు అందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్తులో శాన్వి సుదీప్ పెద్ద సింగర్ అవ్వాలని కోరుకుంటున్నారు.

ఇక శాన్వి సుదీప్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫొటోలతో పాటు ఫ్యామిలీ ఫొటోలు కూడా షేర్ చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు