Kalki Pre Release Event : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు స్టార్ హీరోలు కూడా..

కల్కి సినిమాకు ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం నిర్వహించనున్నారు.

Kalki Pre Release Event : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు స్టార్ హీరోలు కూడా..

Prabhas Kalki 2898AD Movie Pre Release Event AP CM Chandrababu naidu Deputy CM Pawan Kalyan and Star Heros Attending Rumours goes Viral

Kalki Pre Release Event : ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోలు, నటీనటులు ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమాకి నటీనటులతో కాకుండా వెహికల్ తో కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

అయితే కల్కి సినిమాకు ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం నిర్వహించనున్నారు. కల్కి నిర్మాత అశ్వినీదత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బాగా క్లోజ్ అని తెలిసిందే. ఎన్టీఆర్ ఉన్నపట్నుంచి టీడీపీకి సపోర్ట్ గా నిలుస్తున్నాడు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు కూడా ఇచ్చాడు నిర్మాత అశ్వినీదత్. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు సీఎం అవ్వడంతో సినీ పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక అశ్వినీదత్ అయితే ఆనందంలో ఉన్నారు.

Also Read : Pushpa 2 Update : వామ్మో.. పుష్ప 2 షూటింగ్ ఇంకా అంత బ్యాలెన్స్ ఉందా..? ఎప్పటికి అవ్వుద్ది?

దీంతో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో గ్రాండ్ గా చేయాలని, దానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని గెస్టులుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అశ్వినీదత్ అడగడం, అమరావతిలో భారీ సినిమా ఈవెంట్ అంటే చంద్రబాబు కూడా ఓకే అంటారని తెలుస్తుంది. అలాగే ఈ ఈవెంట్ కు కల్కి సినిమాలో నటిస్తున్న ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లను కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో కల్కి సినిమా కంటే కూడా ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే ఏపీ సీఎం, స్టార్ హీరోలు అంతా ఒకే స్టేజి మీదకు కల్కి సినిమా కోసం వస్తారా, ఈవెంట్ అమరావతిలో జరుగుతుందా చూడాలి.