Best Mobile Phones 2024 : ఈ జూన్‌లో రూ. 50వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Mobile Phones 2024 : ఈ జూన్‌లో భారత్ మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి. 

Best Mobile Phones 2024 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్లు రూ.50వేల లోపు ధరలో అనేక ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. వేగవంతమైన ప్రాసెసర్‌లు, బెస్ట్ కెమెరాలు, బ్యాటరీలతో అత్యంత ఖరీదైన వాటితో సమానంగా ఉంటాయి. షావోమీ 14 సివి 5జీ ఫోన్, వన్‌ప్లస్ 12ఆర్ 5జీ, వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11 5జీ, వివో వి30 ప్రో 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జూన్‌లో భారత్ మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Read Also : Moto Edge 50 Pro Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో ఎడ్జ్ 50ప్రోపై భారీ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

షావోమీ 14 సివి 5జీ :
షావోమీ 14 అల్ట్రా 5జీ ఫోన్ మాదిరిగానే ఎర్గోనామిక్స్‌తో షావోమీ 14 సివి 5జీ ఫోన్ సరసమైన ధరకే వస్తుంది. షావోమీ 14 సివిలో అన్నీ ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. లుక్స్ పరంగా హై-ఎండ్ ఫోన్. ధర రూ. 42,999కే అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 12-బిట్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్టంగా 12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 చిప్ అందిస్తోంది.

బ్యాటరీ సామర్థ్యం కేవలం 4,700mAh బ్యాటరీ 300mAh తక్కువగా ఉంటుంది. 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. బాక్స్‌లో ఛార్జర్‌ పొందుతారు. షావోమీ ఫోన్ చాలా స్లిమ్. షావోమీ 14 అల్ట్రా 5జీ, షావోమీ 14 5జీ మాదిరిగానే ఉంటుంది. షావోమీ 14 సివి 5జీ కూడా లైకా-ట్యూన్డ్ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది.

వన్‌ప్లస్ 12ఆర్ 5జీ :
వన్‌ప్లస్ 12ఆర్ 5జీ ఫోన్ 120Hz కర్వడ్ అమోల్డ్ స్క్రీన్ సైజులో వస్తుంది. ప్రత్యేకమైన ఆక్వా-టచ్ లేయర్ కలిగి ఉంది. మెరుగైన కెమెరా ట్యూనింగ్‌ అందిస్తుంది. ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. భారీ 5,500mAh బ్యాటరీ ఛార్జర్ అందిస్తుంది. అదనంగా, 100డబ్ల్యూ ఛార్జర్ వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. స్టైలిష్ మెటల్ ఫ్రేమ్‌ కలిగి ఉంటుంది. ఈ అన్ని అప్‌గ్రేడ్‌లు ఆకర్షణీయమైన ధరతో వస్తాయి. వన్‌ప్లస్ 11ఆర్ మాదిరిగానే వన్‌ప్లస్ 12ఆర్ 5జీ ఫోన్ రూ. 39,999 నుంచి ప్రారంభమవుతుంది.

వన్‌ప్లస్ 11 5జీ :
అమెజాన్‌లో వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ రూ. 45,999 ప్రారంభ ధరతో వస్తుంది. మీరు టాప్ రేంజ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. 120Hz అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 16జీబీ వరకు ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌తో ఆధారితమైనది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. బాక్స్‌లో ఛార్జర్‌తో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఉంది. బేస్ వేరియంట్‌లో పొందే 128జీబీ స్టోరేజీ కావచ్చు. వన్‌ప్లస్ 12ఆర్ మాదిరి కాకుండా, వన్‌ప్లస్ 11 5జీ హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

వివో వి30 ప్రో 5జీ :
వివో వి30ప్రో 5జీ ఫోన్ టాప్-టైర్ కెమెరా పర్ఫార్మెన్స్ (Zeiss) ఆప్టిక్స్‌తో వచ్చిన ఫస్ట్ వి-సిరీస్ ఫోన్. హై-ఎండ్ వివో ఎక్స్-సిరీస్ ఫోన్లలో కెమెరాలతో పాటు వివో వి30 ప్రో 5జీ ఫోన్ రూ. 50వేల కన్నా తక్కువ ధరకు వస్తుంది. ఈ వివో ఫోన్ ఫ్రంట్ సైడ్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డైమెన్సిటీ 8200 చిప్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీతో వస్తుంది.

Read Also : Elon Musk : ఈవీఎంలతో హ్యాకింగ్ రిస్క్.. ఎలన్ మస్క్‌ హెచ్చరిక.. బీజేపీ నేత రియాక్షన్ ఇదే!

ట్రెండింగ్ వార్తలు