ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీక‌ర్‌గా అయ్యన్న పాత్రుడు..! డిప్యూటీ స్పీకర్ గా ..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ రేసులో పలువురు టీడీపీ సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ గా అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది.

AP Assembly Speaker : ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సహా 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. ఈసారి క్యాబినెట్ లో పార్టీలో సీనియర్లను కాదని చంద్రబాబు కొత్తవారికి అవకాశం కల్పించారు. అయితే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Also Read : Nikhil Siddhartha : చీరాల ప్రజల కోసం పనిచేస్తున్న నిఖిల్.. సమస్య చెప్పగానే ఆ ఎమ్మెల్యే తరపున తీరుస్తున్న హీరో..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ రేసులో పలువురు టీడీపీ సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ గా అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడి పేరును దాదాపు ఖరారు చేసినట్లు, త్వరలోనే ఆయన పేరును ప్రకటిస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీ ఎమ్మెల్యేకు దక్కే అవకాశం ఉంది. జనసేన నుంచి నెల్లిమర్ల (విజయనగరం) ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Also Read : టార్గెట్ రెండున్నరేళ్లు.. అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రణాళిక

చీఫ్‌విప్‌గా టీడీపీ సీనియర్ నేత దూళిపాల నరేద్ర పేరును సీఎం చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినట్లు, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు