Darshana : మలయాళ కుట్టి, హృదయం ఫేమ్ ‘దర్శన’ గుర్తుందా..? ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ..

హృదయం సినిమాలో తన క్యూట్ నటనతో అందర్నీ అలరించిన మలయాళ కుట్టి దర్శన రాజేంద్రన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది.

Darshana Rajendran : మలయాళ భామ దర్శన రాజేంద్రన్ మలయాళంలో హృదయం, జయ జయ జయహే, పురుష ప్రేతం.. ఇలాంటి పలు సినిమాలతో హిట్స్ కొట్టి పాపులర్ అయింది. హృదయం సినిమాతో కేవలం మలయాళ ప్రేక్షకులను మాత్రమే కాక సౌత్ ఇండియా ప్రేక్షకులందర్నీ మెప్పించింది. హృదయం సినిమాలో తన క్యూట్ నటనతో అందర్నీ అలరించింది. ఇప్పుడు ఈ మలయాళ కుట్టి దర్శన రాజేంద్రన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది.

Also Read : Sanvi Sudeep : కిచ్చ సుదీప్ కూతుర్ని చూశారా? సింగర్‌గా దూసుకుపోతూ..

సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ పాత్రలో తెరకెక్కుతున్న సినిమా పరదా. ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. నేడు దర్శన పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి తన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే దర్శన ఈ సినిమాలో ఓ సివిల్ ఇంజనీర్ లా నటిస్తున్నట్టు తెలుస్తుంది. గ్లింప్స్ చివర్లో అబ్బాయిలు చేయలేనిది, అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనడం అంటూ డైలాగ్ చెప్పింది.

ఇక ఈ పరదా సినిమా నుంచి ఇప్పటికే అనుపమ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలో నటిస్తుంది. అమ్మాయిలకు ఆంక్షలు, ట్రావెలింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. మరి మలయాళీ సినిమాలతో మెప్పించిన దర్శన ఇప్పుడు తెలుగులో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు