Volkswagen ID.7 GTX : కొత్త కారు చూశారా? ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 జీటీఎక్స్ వచ్చేసింది.. 595 కి.మీ రేంజ్‌!

Volkswagen ID.7 GTX Launch : ఈ ఫాస్ట్‌బ్యాక్ కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఐడీ.7 జీటీఎక్స్ 595 కిలోమీటర్ల వరకు డబ్ల్యూఎల్‌టీపీ పరిధిని కలిగి ఉంది.

Volkswagen ID.7 GTX : కొత్త కారు కొంటున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త కారు మోడల్ ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 జీటీఎక్స్01, 340 పీఎస్ అవుట్‌పుట్, ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్‌, ఫాస్ట్‌బ్యాక్‌తో ఐడీ.7 మోడల్‌ పరిధిని విస్తరించింది. ఐడీ.7 జీటీఎక్స్ టూరర్‌తో పాటు కొత్త ఐడీ.7 జీటీఎక్స్ కూడా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన కార్లలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ వాహనం.

Read Also : TVS iQube e-scooter : కొత్త వేరియంట్లతో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 75కి.మీ టాప్ స్పీడ్, ధర ఎంతంటే?

ఈ ఫాస్ట్‌బ్యాక్ కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఐడీ.7 జీటీఎక్స్ 595 కిలోమీటర్ల వరకు డబ్ల్యూఎల్‌టీపీ పరిధిని కలిగి ఉంది. ఐడీ.7 జీటీఎక్స్ బ్యాటరీని డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లలో గరిష్టంగా 200కిలోవాట్ వరకు ఛార్జ్ చేయవచ్చు. అత్యంత వేగంగా 86kWh బ్యాటరీ 26 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. కొత్త ఐడీ.7 జీటీఎక్స్ ఫ్రంట్, బ్యాక్ జీటీఎక్స్ డిజైన్‌ కలిగి ఉంది.

బయటి ఫీచర్లలో డైమండ్-కట్ సర్ఫేస్‌లతో కూడిన కొత్త 20-అంగుళాల స్కాజెన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్, బ్యాక్ వైపున వోక్స్‌వ్యాగన్ లోగోలతో ఐక్యూ.లైట్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు ఉన్నాయి. రెడ్-కాంట్రాస్టింగ్ టాప్‌స్టిచింగ్‌తో కూడిన హీటెడ్ సీట్లు, బ్యాక్‌రెస్ట్‌లపై జీటీఎక్స్ వంటి ఫీచర్ల కారణంగా లోపలి భాగాన్ని కలిగి ఉంది. మరో జీటీఎక్స్-నిర్దిష్ట ఫీచర్ రెడ్ సెంటర్ ప్యానెల్, రెడ్ టాప్‌స్టిచింగ్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ కలిగి ఉంది. ఐడీ.7 జీటీఎక్స్ లోపలి భాగం 30 కలర్ లైటింగ్ ద్వారా ప్రకాశిస్తుంది.

ఇతర ప్రామాణిక డివైజ్‌లలో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కోసం వైర్‌లెస్ యాప్-కనెక్ట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, ఇంటిగ్రేటెడ్ చాట్ జీపీటీ (ఏఐ/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ఐడీఏ వాయిస్ అసిస్టెంట్, రెండు-జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, కీలెస్ లాకింగ్, స్టార్టింగ్ ఉన్నాయి. సిస్టమ్ కీలెస్ యాక్సెస్, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్ అందిస్తుంది. లేటెస్ట్ ఆప్షనల్ టెక్నాలజీతో పార్క్ అసిస్ట్ ప్రో ఉంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి పార్కింగ్ విధానాలను కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : TVS Apache RTR 160 Series : సరికొత్త బ్లాక్ ఎడిషన్‌తో టీవీఎస్ అపాచీ RTR 160 సిరీస్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు