T20 World Cup 2024 : టీ20 ప్రపంచక‌ప్‌ సూపర్ -8లో ఆడే జట్ల వివరాలు.. మ్యాచ్‌ల‌ పూర్తి షెడ్యూల్ ఇదే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -8లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుంది.

T20 World Cup 2024 Super 8 Schedule: టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా లీగ్ దశ మ్యాచ్ ల ప్రక్రియ పూర్తయింది. సోమవారం ఉదయం బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్, నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ లు జరిగాయి. ఈ మ్యాచ్ లలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు విజయం సాధించడంతో సూపర్ -8 జట్లపై పూర్తి క్లారిటీ వచ్చేసింది.

Also Read : క్లారిటీ వచ్చేసిది.. ఉత్కంఠభరిత పోరులో విజయంతో సూపర్ -8లోకి దూసుకొచ్చిన బంగ్లాదేశ్ జట్టు

సూపర్ -8లో భాగంగా గ్రూప్ – ఎ నుంచి భారత్, అమెరికా, గ్రూప్ -బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, గ్రూప్ -సీ నుంచి ఆఫ్గనిస్థాన్, వెస్టిండీస్, గ్రూప్ -డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు సూపర్ -8కు అర్హత సాధించాయి.
గ్రూప్ -1 : భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
గ్రూప్ -2 ఫ అమెరికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.

సూపర్ -8లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుంది. జూన్ 20న బార్బడోస్ లో ఆఫ్గనిస్థాన్ తో, జూన్ 22న ఆంటిగ్వాలో బంగ్లాదేశ్ జట్టుతో, జూన్ 24న సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు ప్రారంభం అవుతాయి.

Also Read : అయ్యయ్యో పాక్.. చివరి మ్యాచ్‌లోనూ అతి కష్టంమీద గెలుపు

మ్యాచ్ ల తేదీలు, వేదికల వివరాలు.. (భారత కాలమానం ప్రకారం)
జూన్ 19న : యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్ 20న : ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)
జూన్ 20న : ఇండియా వర్సెస్ ఆఫ్గానిస్తాన్ (బార్బడోస్)
జూన్ 21న : ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 21న : ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (బార్బడోస్)
జూన్ 22న : యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)
జూన్ 22న : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 23న : ఆఫ్గానిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)
జూన్ 23న : యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లాండ్ (బార్బడోస్)
జూన్ 24న : వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్ 24న : ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)
జూన్ 25న : ఆఫ్గానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (St.విన్సెంట్)
జూన్ 27న : సెమీ ఫైనల్ -1 (గయానా)
జూన్ 27న : సెమీ ఫైనల్ -2 (ట్రినిడాడ్)
జూన్ 29న : ఫైనల్ మ్యాచ్ (బార్బడోస్)

 

 

ట్రెండింగ్ వార్తలు