Train Accident : పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.

Kanchanjunga express accident in West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించగా.. 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ బోగీ గాల్లోకి లేచింది.

Also Read:  T20 World Cup 2024 : టీ20 ప్రపంచక‌ప్‌ సూపర్ -8లో ఆడే జట్ల వివరాలు.. మ్యాచ్‌ల‌ పూర్తి షెడ్యూల్ ఇదే..

అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్ కతా లోని సెల్దాకు కంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరింది. న్యూజ‌ల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరి కొద్దినిమిషాలకే రంగపాని స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టింది. దీంతో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాదం తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ట్రాక్ పై నుంచి బోగీలను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Trainman App Offers: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పిన ట్రైన్‌మ్యాన్.. రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఫ్లైట్ టికెట్ ఉచితం ..

సంఘటన స్థలానికి మమత బెనర్జీ..
ఘోర రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. డీఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయంకోసం ఘటన స్థలానికి చేరుకున్నాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించారని మమత పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలికి సీఎం మమత బెనర్జీ బయలుదేరారు.

స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. 
బెంగాల్ లో రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. రైలు ప్రమాదం స్థలివద్ద యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారని తన ట్విటర్ ఖాతాలో మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు