Moto Edge 50 Pro Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో ఎడ్జ్ 50ప్రోపై భారీ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Moto Edge 50 Pro Launch : మోటో ఎడ్జ్ 50ప్రోపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కొనుగోలుకు ఇది సరైన సమయం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫోన్ రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది.

Moto Edge 50 Pro Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అదే.. మోటో ఎడ్జ్ 50ప్రో ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన ఆప్షన్లతో లాంచ్ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది.

Read Also : Volkswagen ID.7 GTX : కొత్త కారు చూశారా? ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 జీటీఎక్స్ వచ్చేసింది.. 595 కి.మీ రేంజ్‌!

మోటో ఎడ్జ్ 50ప్రోపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కొనుగోలుకు ఇది సరైన సమయం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫోన్ రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.36,999. దీనికి అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈఎంఐ రహిత లావాదేవీలపై రూ. 2వేల బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ మోటో ఫోన్ ధరను రూ. 27,999కి తగ్గించవచ్చు. ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 50ప్రో స్పెషిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 6.7-అంగుళాల 1.5కె పోఓఎల్ఈడీ డిస్‌ప్లేను ట్రూ కలర్ పాంటోన్ వాలిడేటెడ్ సర్టిఫికేషన్‌తో కలిగి ఉంది. ఈ ప్యానెల్‌కు హెచ్‌డీఆర్10ప్లస్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2వేల నిట్స్ సపోర్టు ఉంది. ఈ కొత్త మోటోరోలా ఎడ్జ్ 50ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. ర్యామ్ బూస్ట్ ద్వారా విస్తరించవచ్చు.

హుడ్ కింద, ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 125డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టును కూడా అందిస్తుంది. కంపెనీ గరిష్టంగా 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్, 10డబ్ల్యూ వైర్‌లెస్ పవర్ షేరింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ ఏఐ ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. కలర్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ కోసం ఫొటోలను ఆటోమాటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తుంది. స్పెషల్ ఫీచర్ స్టైల్ సింక్, యూజర్ ఆధారంగా 4 వాల్‌పేపర్ ఆప్షన్ల సెట్‌తో జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తుంది.

కస్టమైజడ్ టచ్‌ను అనుమతిస్తుంది. మోటో ఏఐ వీడియోలలో ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్ వంటి అదనపు ఫీచర్‌లను కూడా అందిస్తుంది. నిర్దిష్ట మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఆప్టిక్స్ పరంగా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఆల్-పిక్సెల్ ఫోకస్, ఓఐఎస్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను అందిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 13ఎంపీ అల్ట్రా-వైడ్ ప్లస్ మాక్రో విజన్ సెన్సార్, ఓఐఎస్‌తో 10ఎంపీ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో హై-రిజల్యూషన్ సెల్ఫీలకు క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 50ఎంపీ సెన్సార్ అందిస్తుంది.

Read Also : Zelo Ebikes Scooters : జెలియో ఎబైక్స్ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. డ్రైవింగ్ లైసెన్స్‌ లేకుండానే నడపొచ్చు.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు