Google Pixel 7a Discount : గూగుల్ పిక్సెల్ 7ఎపై భారీ తగ్గింపు.. రూ. 35వేల లోపు ధరకే సొంతం చేసుకోండి!

Google Pixel 7a Discount : పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ ‘ఎ’ సిరీస్ ఎల్లప్పుడూ యూజర్లకు అనేక ప్రీమియం ఫీచర్‌లతో సరసమైన సిరీస్‌గా అందిస్తోంది. ఇప్పుడు పిక్సెల్ 7ఎ భారీ తగ్గింపుతో పొందవచ్చు. 

Google Pixel 7a Discount : ప్రముఖ ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 7ఎ ఫోన్ గత ఏడాదిలో లాంచ్ అయింది. ఈ సేల్ సమయంలో ఒక స్పెషల్ డీల్ కూడా పొందవచ్చు. రూ.43,999 ఖరీదు చేసే ఈ ఫోన్ ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా రూ.35వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ ‘ఎ’ సిరీస్ ఎల్లప్పుడూ యూజర్లకు అనేక ప్రీమియం ఫీచర్‌లతో సరసమైన సిరీస్‌గా అందిస్తోంది. ఇప్పుడు పిక్సెల్ 7ఎ భారీ తగ్గింపుతో పొందవచ్చు.

Read Also : Elon Musk’s Billion Dollar Dance: రూ.4.67 లక్షల కోట్ల జీతం.. ఆనందం పట్టలేక డ్యాన్స్ చేసిన ఎలాన్ మస్క్

ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 7ఎ తగ్గింపు :
పిక్సెల్ 7ఎ ఫోన్ రూ. 34,999కి విక్రయిస్తోంది. ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా ఉంటుంది. అయితే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎక్స్ఛేంజ్ కోసం పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫోన్‌‌పై అదనంగా రూ. వెయ్యి తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ సిద్ధంగా ఉంటే.. మరింత తగ్గింపు పొందవచ్చు. అయితే, డిస్కౌంట్ విలువ మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 7ఎ, పిక్సెల్ 8ఎ ఫోన్ :
గూగుల్ పిక్సెల్ 8ఎ పరిశీలిస్తే.. పిక్సెల్ 7ఎ కొనడం విలువైనదేనా? అని ఆశ్చర్యపోతున్నారు. పిక్సెల్ 7ఎ ఫోన్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను 90హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. గూగుల్ టెన్సర్ జీ2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. పిక్సెల్ 7ఎ కెమెరా సెటప్‌లో 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 13ఎంపీ కెమెరా ఉంది. మరోవైపు, పిక్సెల్ 8ఎ ఫోన్ కూడా 6.1-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 1080 x 2400 రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

అయితే, పిక్సెల్ 7ఎతో పోల్చినప్పుడు.. అక్ట్యూవా డిస్‌ప్లే 40 శాతం బ్రైట్‌నెస్ ఉందని గూగుల్ పేర్కొంది. పిక్సెల్ 8ఎ ఫోన్ 120Hz వరకు అధిక రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉంది. అదనంగా, ఫోన్ మరింత శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది. గూగుల్ టెన్సర్ జీ3 ఫోన్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోలో కూడా పనిచేస్తుంది.

కెమెరా పరంగా పిక్సెల్ 8ఎ ఫోన్ 64ఎంపీ మెయిన్ లెన్స్, 13ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పిక్సెల్ 7ఎ స్పెషిఫికేషన్లను కలిగి ఉంది. బ్యాక్‌సైడ్ 13ఎంపీ కెమెరాతో పాటు పెద్ద ఫీల్డ్-ఆఫ్-వ్యూతో ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అయితే, పిక్సెల్ 8ఎ కెమెరా బెస్ట్ టేక్, మ్యాజిక్ ఎడిటర్ వంటి కొన్ని ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.

అంతేకాకుండా, గూగుల్ పిక్సెల్ 8ఎ ఇన్-బిల్ట్ జెమిని ఏఐ అసిస్టెంట్‌తో వస్తుంది. వినియోగదారులు టైప్ చేసేందుకు అనుమతిస్తుంది. పిక్సెల్ 7ఎ, పిక్సెల్ 8ఎ రెండూ ఐపీ67 డస్ట్/వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. స్క్రీన్‌లలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉన్నాయి. స్పెషిఫికేషన్లు ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 8ఎ అనేది ఏఐ ఫీచర్లు మెరుగైన స్పెషిఫికేషన్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర (రూ. 52,999) ధర ఉంటుంది. పవర్‌ఫుల్ కెమెరా, ప్రాసెసర్ పిక్సెల్ 7ఎ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Best Phones 2024 : ఈ జూన్‌లో రూ. 40వేల ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు