Elon Musk’s Billion Dollar Dance: రూ.4.67 లక్షల కోట్ల జీతం.. ఆనందం పట్టలేక డ్యాన్స్ చేసిన ఎలాన్ మస్క్

డ్యాన్సుకు బిలియన్ డాలర్ డ్యాన్స్ అని నెటిజన్లు పేరు పెట్టారు. వేదికపై అటూ ఇటూ..

Elon Musk’s Billion Dollar Dance: రూ.4.67 లక్షల కోట్ల జీతం.. ఆనందం పట్టలేక డ్యాన్స్ చేసిన ఎలాన్ మస్క్

జీతం రూ.2 వేలు పెరిగితేనే ఎగిరి గంతులేస్తాం. అటువంటిది ఇకపై ఏడాదికి రూ.4.67 లక్షల కోట్ల జీతం వస్తుందని తెలిస్తే ఎవరైనా గంతులు వేయకుండా ఉంటారా? ఉండలేరు.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం తన జీతం గురించి తెలుసుకుని చిందులేశారు.

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు ఏడాదికి రూ.4.67 లక్షల కోట్ల జీతం ఇవ్వడానికి ఆ కంపెనీ వాటాదారులు అనుమతించారు. దీంతో ఎలాన్ మస్క్ సంతోషం పట్టలేక చేసిన డ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న సీఈవోల్లో ఆయన నంబర్ 1గా ఉన్నారు.

ఆయన చేసిన డ్యాన్సుకు బిలియన్ డాలర్ డ్యాన్స్ అని నెటిజన్లు పేరు పెట్టారు. వేదికపై అటూ ఇటూ తిరుగుతూ చేతులు, కాళ్లు కదిలిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ అలరిస్తోంది. కాగా, తాజాగా టెస్లా వార్షిక సమావేశంలో మస్క్ జీతాన్ని  నిర్ధారిస్తూ వాటాదారుల వోటింగ్ ప్రక్రియ నిర్వహించారు. మస్క్ వార్షిక వేతనాన్ని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఎప్పుడైనా సరే ఈ ప్యాకేజీలో సవరణలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా, రెండో త్రైమాసిక ఫలితాల్లో టెస్లా విక్రయాలు తగ్గాయి.

Also Read: వాట్పాప్ యూజర్లకు పండుగే.. 3 మేజర్ కాలింగ్ ఫీచర్లు.. 32 మందితో వీడియో కాల్స్, ఆడియోతో స్ర్కీన్ సేరింగ్..!