Small Currency Notes : అమ్మయ్యా.. ఇక చిల్లర కష్టాలు తీరినట్టే.. ATMలో రూ. 10, రూ.20, రూ. 50 నోట్లు.. ఎప్పటినుంచంటే?
Small Currency Notes : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏటీఎంలలో రూ. 10, రూ. 20, రూ. 50 కరెన్సీ నోట్లను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తి వివరాలివే..
Small Currency Notes
- చిల్లర కష్టాలకు ఇక చెక్ పడినట్టే
- ఏటీఎంలో రూ.10, రూ.20, రూ. 50 నోట్లు కూడా వస్తాయి
- ఆటో, బస్సు, కిరాణా మార్కెట్లలో చిల్లర సమస్య ఉండదు
- పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఆర్బీఐ, ముంబైలో ట్రయల్స్
Small Currency Notes : చిల్లర కష్టాలు తీరనున్నాయి. అతి త్వరలో ఏటీఎంల్లో చిన్న కరెన్సీ నోట్లు కూడా రానున్నాయి. ఇప్పటివరకూ రూ. 100 నోట్ల నుంచి రూ. 500, రూ. 2000 ఇలా ఏటీఎంల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ, చిన్న మొత్తంలో చిల్లర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిన్న కరెన్సీ నోట్ల కోసం రోజువారీ జీవితంలో పెద్ద సమస్యగా మారింది.
టీ షాపుల నుంచి ఆటో ఛార్జీలు, బస్సులు, లోకల్ మార్కెట్లో షాపింగ్ వంటి పలు ప్రదేశాల్లో తరచుగా 10, 20 లేదా 50 రూపాయల నోట్ల చిల్లర కోసం ఇబ్బందులు తప్పడం లేదు. రూ. 500కు చిల్లర దొరకదు. రూ. వెయ్యి లేదా రూ. 2వేలకు అసలు ఛాన్స్ లేదు..
ఈ సమస్యను పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏటీఎంల నుంచి ఈ చిన్న కరెన్సీ నోట్లను విత్ డ్రా చేసుకునేలా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
చిన్న నోట్ల కోసం చిన్న ఏటీఎం మిషన్లు :
ఏటీఎంల్లో ఎక్కువగా రూ.100, రూ. 200 లేదా రూ.500 నోట్లు అందుబాటులో ఉంటాయి. చిన్న లావాదేవీలకు కష్టంగా మారింది. ఇప్పుడు, ఆర్బీఐ “స్మాల్ వాల్యూ డిస్పెన్సర్లు” పేరుతో స్పెషల్ మిషన్లను టెస్టింగ్ చేస్తోంది.
ముంబైలో ట్రయల్స్.. త్వరలో అన్ని నగరాల్లోకి :
ఈ స్మాల్ సైజ్ ఏటీఎం మిషన్లు ప్రత్యేకంగా 10, 20, 50 రూపాయల నోట్లను పంపిణీ చేసేందుకు రూపొందించారు. ముంబై వంటి నగరాల్లో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. డిజిటల్ పేమెంట్లపై తక్కువ ఆధారపడే వారికి భారీగా ఉపశమనం లభిస్తుంది.
దేశంలో ఈ నోట్ల కొరత లేదని మంత్రి చౌదరి స్పష్టం చేశారు. పార్లమెంటులో డేటా ఆధారంగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 43,940 లక్షల రూ.10 నోట్లు, 19,370 లక్షల రూ.20 నోట్లు, 13,030 లక్షల రూ.50 నోట్లు ముద్రించినట్టు తెలిపారు. గత సంవత్సరాలతో పోలిస్తే భారీగా పెరిగింది, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,000 లక్షల నుంచి రూ.10 నోట్లు రెట్టింపు అయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న వ్యాపారాలకు బిగ్ రిలీఫ్. కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి కిరాణా కొట్టు వరకు చిల్లరకు ఇక ఇబ్బంది ఉండదు. సాధారణ ప్రజల రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. చిన్న నోట్లతో లావాదేవీలు ఈజీ కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రతి ఏటీఎం నుంచి చిన్న నోట్లను డ్రా చేసుకోవచ్చు.
