Tg KGBV 2026 : పదో తరగతి విద్యార్థినిలకు గోల్డెన్ ఛాన్స్.. KGBVల్లో ఇంటర్ విద్యాతో పాటు.. JEE, నీట్ పరీక్షలకు ఫ్రీ కోచింగ్..!
Tg KGBV 2026 : తెలంగాణలోని పదో తరగతి విద్యార్థినిలకు సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి ఇంటర్ విద్యతో పాటు జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది.
Telangana YIIOE kgbv educational institutions intermediate admission application process will start from 2026 16th march
Tg KGBV 2026 : తెలంగాణ సర్కార్… రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో మెరుగైన సౌకర్యాలు, మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు గాను వీటిని ‘యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్’ కాలేజీలుగా మార్చింది. మొదటి విడతలో 93 కేజీబీవీలను ఎక్సలెన్స్‌గా మార్చింది. ఈ క్రమంలో వీటిలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష (Entrance Test) నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి తాజాగా తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా కేజీబీవీల్లో ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), ఎంఈసీ (MEC) గ్రూపుల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఆర్జేసీ సెట్ (TG RJC CET-2026) నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 16 నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 15 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత.. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థినులకు సీట్లు కేటాయిస్తారు.
అయితే, ఈ 93 కేజీబీవీలను యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చినందున మాత్రమే వీటిలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. మిగతా కేజీబీవీల్లో గతంలో మాదిరిగానే 10వ తరగతి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం http://tgrjc.cgg.gov.in వెబ్సైట్ చూడాలని సూచించారు.
ప్రతి జిల్లాకు మూడు చొప్పున 31 జిల్లాల్లో మొత్తం 93 కేజీబీవీలను యంగ్ ఇండియా స్కూళ్లుగా మార్చారు. వీటిలో ఇంటర్లో చేరిన విద్యార్థులకు జేఈఈ మెయిన్ (JEE Main), నీట్ (NEET), క్లాట్ (CLAT), ఎప్‌సెట్ (EAPCET) వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: మార్చి 16
- చివరి తేదీ: ఏప్రిల్ 15
- పరీక్ష తేదీ: మే 3
