HPCL Jobs 2026 : ఈ జాబ్ కొట్టారంటే లైఫ్ సెట్టు.. నెలకు రూ.లక్షకు పైగా జీతం.. వెంటనే అప్లై చేసుకొండి
HPCL Jobs 2026 : మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం కోసం చూసే వారికి ఇది నిజంగా బంపరాఫరే అని చెప్పవచ్చు. నెలకు రూ.లక్షలకు పైగా జీతం పొందే అవకాశం కల్పిస్తున్నారు.
HPCL 2026 Recruitment Notification for 731 Engineer and Other Posts full details here
HPCL Jobs 2026 : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 732 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీర్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.
ముఖ్యమైన వివరాలు:
- సంస్థ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).
- మొత్తం ఖాళీలు: 731 పోస్టులు.
- దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 25, 2026.
- చివరి తేదీ: మార్చి 25, 2026 (రాత్రి 11:59 వరకు).
- ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్ మరియు ఇంటర్వ్యూ.
- తాత్కాలిక పరీక్ష తేదీ : మే 3, 2026.
అర్హతలు:
- విద్యార్హత: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల పూర్తి కాల రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- ప్రత్యేక అర్హతలు: కొన్ని సాంకేతిక పోస్టులకు ‘ఇండస్ట్రియల్ సేఫ్టీ’లో అదనపు డిప్లొమా అవసరం ఉండవచ్చు.
వయోపరిమితి: పోస్టులను అనుసరించి సాధారణంగా 25 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- మొదట HPCL అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Careers’ విభాగానికి వెళ్లండి.
- “Recruitment of Officers / Junior Executives – February 2026” అనే లింక్‌ను ఎంచుకోవాలి.
- మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీతో కొత్త యూజర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి.
- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసి భద్రపరుచుకోవాలి.
ఫీజు వివరాలు: జనరల్/OBC-NCL/EWS అభ్యర్థులకు సుమారు రూ. 1,180. ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు దివ్యాంగులకు (PwBD) అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది.
