Viral Video : యూట్యూబర్ సరికొత్త ప్రయోగం.. కేవలం రూ. 12.5 లక్షలకే హోండా సివిక్‌ను లగ్జరీ కారు ‘లంబోర్ఘిని’గా మార్చేశాడు..!

YouTuber Tanna Dhaval : యూట్యూబర్ తన్నా ధవల్ కొత్త హోండా సిటీని "లంబోర్ఘిని టెర్జో మిలీనియో"గా మార్చేశాడు. కొత్త రూపం దాల్చిన సెడాన్ కారు ఆటో ఔత్సాహికులను ఆకట్టుకునే మేక్ఓవర్ పొందింది. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video : అతడో యూట్యూబర్.. కార్లపై అతడికి ఎంతో మక్కువ. అందులోనూ లగ్జరీ కారు లంబోర్ఘిని కారు అంటే చాలా ఇష్టం.. అదే అతడిని కొత్త కారును తయారుచేసేలా చేసింది. భారత్‌కు చెందిన యూట్యూబర్ తన్నా ధవల్ హోండా సివిక్‌ను ఇటాలియన్ లగ్జరీ కారు మోడల్‌ లంబోర్ఘిని టెర్జో మిలీనియో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారుగా మార్చేశాడు. హోండా సిటీ సెడాన్‌ను లంబోర్ఘినిగా మార్చేసిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ లంబోర్ఖిని కారు వీడియో ఆటో ఔత్సాహికులను సైతం ఆకట్టుకుంది.

Read Also : Realme P1 Pro 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల 21న రియల్‌మి P1 ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్.. ధర ఎంతంటే?

అదొక్కటే మార్చడం కుదరలేదట :
గుజరాత్‌కు చెందిన యూట్యూబర్ తన్నా ధవల్ కార్ల పట్ల తనకు ఉన్న అంకితభావాన్ని సూచిస్తుంది. ధవల్ ఒక సరికొత్త 2008 హోండా సివిక్ 1.8 మోడల్‌తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. ఒక ఏడాది పాటు కష్టపడి మరి దానిపై పెట్టుబడి పెట్టాడు. సివిక్ రియల్ ఇంజన్, అప్లియన్సెస్ ఉపయోగించి పసుపు రంగు ‘లంబోర్ఘిని’ని తయారు చేశాడు.

అయితే, ఇందులో వివిధ భాగాలను సోర్సింగ్ చేసి అదే మాదిరిగా కచ్చితత్వంతో నిర్మించాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ధవల్‌కు బాగానే ఖర్చు అయింది. మెటల్ ఫ్రేమ్ లేదా ఫ్రేమ్ ఒక్కటే రూ. లక్ష కన్నా ఎక్కువ అయింది. ఇక లేబర్ ఛార్జీలు దాదాపు రూ.3 లక్షలు అయ్యాయి. మొత్తంగా, లంబోర్ఘిని కారుగా మార్చడానికి సుమారు రూ. 12.5 లక్షలు ఖర్చు అయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, లంబోర్ఘినిని పోలి ఉండే సోర్స్ వీల్స్‌ను తాను పొందలేకపోయానని ధవల్ పేర్కొన్నాడు.

కస్టమ్ లాంబోర్ఘిని స్టిక్కర్ లోగో :
తాను తయారుచేసిన సరికొత్త కారు కోసం కస్టమ్ లాంబోర్ఘిని స్టిక్కర్ లోగోను కూడా ధవల్ క్రియేట్ చేశాడు. ఆ లోగోను కారు బానెట్‌పై ఉంచాడు. ‘ఇది చాలా బాగుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడికి తగినంత డబ్బు ఖర్చు అయింది’ అని యూట్యూబ్ వీడియోలలో వ్యాఖ్యానించాడు. ధవల్ తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలలో మొత్తం ప్రక్రియను డాక్యుమెంట్ చేశాడు. బ్రిటీష్ రేసింగ్ డ్రైవర్ జార్జ్ రస్సెల్‌కు నివాళిగా ధవల్ సవరించిన కారు వెనుక భాగంలో ‘63’ స్టిక్కర్‌ను అతికించాడు.

విండోస్ కోసం ప్రత్యేకించి రియల్ గ్లాసుకు బదులుగా బ్లాక్ ఫిల్మ్‌తో యాక్రిలిక్ షీట్‌ను ఉపయోగించాడు. ఈ గ్లాస్ తెరవడానికి వీలుండదు. దేశభక్తిని చాటుతూ ధవల్ కారును భారత త్రివర్ణ పతాకంతో అలంకరించాడు. వాస్తవానికి “లంబోర్ఘిని ఇటాలియన్ కంపెనీ. కానీ, మన భారత్ జెండా కూడా అక్కడ ఉండాలి’ అని ధవల్ పేర్కొన్నాడు. అన్ని జుగాడ్ వస్తువులను ఉపయోగించామని, ప్రతిదీ సరిపోలాలని ధవల్ తెలిపాడు.

Read Also : Akshata Murty Wealth : 2024 ‘రిచ్ లిస్ట్’​ విడుదల.. యూకే ప్రధాని​ రిషి సునక్ కన్నా భార్య అక్షితా మూర్తి సంపాదనే ఎక్కువ..!

ట్రెండింగ్ వార్తలు