Best Induction Cookers : వంట గ్యాస్ దొరకట్లేదా? డోంట్ వర్రీ.. అందరూ కొనేస్తున్న టాప్ 6 బెస్ట్ ఇండక్షన్ కుక్కర్లు ఇవే!
Best Induction Cookers : వంట గ్యాస్ కొరత కారణంగా చాలామంది వినియోగదారులు ఇండక్షన్ కుక్కర్లు కొనేస్తున్నారు. మార్కెట్లో ఈ కుక్కర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 6 బెస్ట్ టాప్ ఇండక్షన్ కుక్కర్లు ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
Best Induction Cookers
- ఇరాన్, ఇజ్రెయెల్ యుద్ధం ఎఫెక్ట్
- వంటగ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం
- మార్కెట్లోకి ఇండక్షన్ కుక్కర్లకు ఫుల్ డిమాండ్
- ఈ కుక్కర్లను ఎగబడి కొనేస్తున్న వినియోగదారులు
Best induction Cookers : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ LPG ధరలపై పడింది. భారతీయులు వంట గ్యాస్ కోసం క్యూ కట్టేస్తున్నారు. అయినా గ్యాస్ సిలిండర్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో వంట గ్యాస్ వినియోగదారులంతా ఎలక్ట్రిక్ కిచెన్ కుకర్ల వైపు చూస్తున్నారు.
దేశంలోని చాలా రెస్టారెంట్లు, కేఫ్‌లు వంటగ్యాస్ కొరత కారణంగా మెనూలు తగ్గించాయి. ఎక్కడ చూసినా లిమిటెడ్ మెనూలు దర్శనమిస్తున్నాయి. సామాన్య జనం అయితే వంటగ్యాస్ లేదని ఇండక్షన్ కుక్కర్లు వంటి వాటి కోసం తెగ వెతుకుతున్నారు. దాంతో ఇండక్షన్ కుక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. గత రెండు రోజులుగా ఇండక్షన్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది.
మీరు కూడా వంట గ్యాస్ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్నారా? మీకోసం ప్రస్తుతం మార్కెట్లో వంట గ్యాస్ బదులుగా ఇండక్షన్ కుక్కర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మోడల్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రస్తుతం మీ బడ్జెట్ ధరలోనే లభించే టాప్ 6 ఇండక్షన్ కుక్కర్ల గురించి తెలుసుకుందాం..
ఫిలిప్స్ వివా కలెక్షన్ HD4928/012100W :
ఈ ఇండక్షన్ కుక్కర్ 2100W హై పవర్ తో వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్స్ ఉంటాయి. పప్పు, రోటీ వంటి భారతీయ వంటకాలకు బెస్ట్ కుక్కర్. 2100 వాట్ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా కేవలం 4.2 నిమిషాల్లోనే ఒక లీటర్ నీళ్లు మరిగించవచ్చు.
అమెజాన్ బేసిక్స్ ఇండక్షన్ కుక్ టాప్ :
ఈ 1900 వాట్ ఇండక్షన్ కుక్కర్ లీటర్ నీటిని 5.2 నిమిషాల్లో వేడి చేయగలదు. ప్రెజర్ కుకింగ్, డీప్ ఫ్రైయింగ్, కర్రీ, చపాతీ, పాలను వేడి చేయొచ్చు. పెద్దగా ఉంటుంది. పాలు ఎక్కువగా మరిగినా కూడా పాత్రలో నుంచి పొంగవు.
బజాజ్ మెజెస్టి ఐసీఎక్స్ పెర్ల్ 1900W ఇండక్షన్ కుక్ టాప్ :
ఈ ఇండక్షన్ కుక్కర్ కేవలం 5. 2 నిమిషాల్లోపే నీటిని మరిగించగలదు. ఇందులో 1900 వాట్ల హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. పాలు, కర్రీ, ఫ్రెయింగ్, ఇడ్లీ, దోస, చపాతీ వంటి వంటకాల చేసుకోవచ్చు. ఎక్కువగా హీట్ కాకుండా వాట్స్ అడ్జెస్ట్ చేయాల్సి ఉంటుంది. రోజువారీ వంటలకు కీప్ వార్మ్, స్లో కుక్ అనే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో పాజ్ ఫీచర్ లేదు.
ప్రెస్టీజ్ PIC 20 1600W ఇండక్షన్ కుక్‌టాప్ :
ఈ కుక్కర్ 1600 వాట్ల హీటింగ్ ఎలిమెంట్ ద్వారా 6.45 నిమిషాల్లోనే లీటర్ నీటిని మరిగిస్తుంది. డీప్ ఫ్రైయింగ్, సాటింగ్, కర్రీ, ఇడ్లీలు, దోసె, చపాతీ, ప్రెజర్ కుకింగ్, హీటింగ్ మిల్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో మరో అడ్వాంటేజ్ ఉంది.. ఓవర్ హీటింగ్, హై ఓల్టేజ్, డ్రై హీటింగ్, సెన్సార్ ఫెయిల్ వంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
పీజియన్ బై స్టోవ్ క్రాఫ్ట్ క్రూయిజ్ 1800W :
పీజియన్ బై స్టోవ్ క్రాఫ్ట్ క్రూయిజ్ చాలా చౌకగా లభిస్తుంది. లీటర్ నీటిని మరిగించేందుకు 7 నిమిషాలు పడుతుంది. హబ్ లో డీప్ ఫ్రెయింగ్, ఇడ్లీలు, దోసెలు, చపాతీలు, కర్రీ, ప్రెజర్ కుకింగ్, హీటింగ్ మిల్క్ వంటి 7 ప్రీ ప్రోగ్రామ్ ఫీచర్లు ఉన్నాయి హీటింగ్ అయ్యేటప్పుడు ఈ కుక్కర్ కొద్దిగా షేక్ అవుతుంది.
హావెల్స్ ఇన్స్టాకూక్ RT ఇండక్షన్ కుక్‌టాప్ :
1400 వాట్ల కాయిల్ పవర్ అందించే హావెల్స్ ఇన్ స్టాకూక్ ఆర్టీ కూడా సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. హబ్ కు డీప్ ఫ్రైడ్, గ్రేవీ, పప్పు, మాన్యువల్ సహా 4 ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో 16A ప్లగ్ కూడా ఉంది. హై పవర్ వాడే యూనిట్లకు సేఫ్. హీట్ చేసే సమయంలో ఇన్ ఫుట్ వోల్టేజీ తక్కువ లేదా ఎక్కువగా ఉన్నా వెంటనే అలర్ట్ చేస్తుంది.
