Book LPG Gas Cylinder : మీ వంట గ్యాస్ ఏదైనా సరే.. ఇంట్లో నుంచే ఇలా ఈజీగా సిలిండర్ బుకింగ్ చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్
Book LPG Gas Cylinder : గ్యాస్ బుకింగ్ చేసుకోవాలా? HP, Indane, Bharat గ్యాస్ ఏజెన్సీ ఏదైనా సరే.. ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే
Book LPG Gas Cylinder
- ఆన్లైన్లో ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ
- ఫోన్ కాల్, SMS, వాట్సాప్, యాప్ ద్వారా బుక్ చేయొచ్చు
- వంట గ్యాస్ బుకింగ్ ఎన్ని మార్గాల్లో చేయొచ్చంటే?
Book LPG Gas Cylinder : అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం దెబ్బకు వంట గ్యాస్ కొరత వచ్చిపడింది. దేశమంతా గ్యాస్ సిలిండర్ల షార్టేజీ కనిపిస్తోంది. వంటగ్యాస్ కోసం భారీగా క్యూలు దర్శనమిస్తున్నాయి. కొన్ని నగరాల్లో అయితే సిలిండర్ సరఫరా నిలిచిపోయింది. ప్రధానంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకే గ్యాస్ బుకింగ్ కోసం మీరు ఎక్కడికి వెళ్లనక్కర్లేదు. ఇంట్లో నుంచే ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. HP, Indane, Bharat Gas వంటి ఏజెన్సీలు అందించే గ్యాస్ సిలిండర్ ధరలను ఆన్ లైన్ లో ఎలా బుకింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఇండేన్ గ్యాస్ బుకింగ్ ఎలా? :
మీరు ఇండేన్ కస్టమర్ అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి బుకింగ్ చేసుకోవచ్చు. అయితే, కస్టమర్ మొబైల్ నెంబర్ కంపెనీతో రిజిస్టర్ అయి ఉండాలి. కొత్త యూజర్ అయితే రిజిస్టర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత Book Cylinder ఆప్షన్ ఎంచుకోండి. అంతే బుకింగ్ పూర్తి అయినట్టే.
IVRS నంబర్ తో గ్యాస్ బుకింగ్ ఎలా? :
కస్టమర్లు ఫోన్ కాల్ చేసి కూడా సిలిండర్లను బుకింగ్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 7718955555 కాల్ చేయండి. కాల్ తర్వాత వాయిస్ కమాండ్స్ ఫాలో అయి బుకింగ్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు పేమెంట్ లింక్ వస్తుంది.. ఆన్ లైన్ లో పేమెంట్ ఈజీగా చేయొచ్చు.
మిస్డ్ కాల్‌తో సిలిండర్ బుకింగ్ ఈజీ :
ఇండేన్ గ్యాస్ కస్టమర్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8454955555కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ మొబైల్ ఫోన్‌కు పేమెంట్ లింక్ పంపుతుంది. బుకింగ్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ :
వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లలో 75888888824 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి “Hi” మెసేజ్ పంపాలి. చాట్‌బాట్ ఎనేబుల్ అవుతుంది. ఆప్షన్ల ద్వారా సిలిండర్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకుని పేమెంట్ చేయొచ్చు.
భారత్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా? :
భారత్ గ్యాస్ కస్టమర్లు 7715012345 లేదా 7718012345 కు కాల్ చేసి IVRS కాల్ ద్వారా గ్యాస్ రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుకింగ్ కూడా వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంది. కస్టమర్లు 1800224344కు మెసేజ్ పంపవచ్చు . కస్టమర్లు హలో BPCL మొబైల్ యాప్, SMS సర్వీస్ లేదా భారత్ గ్యాస్ వెబ్సైట్ ద్వారా కూడా రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు.
HP గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఇలా :
హిందూస్తాన్ పెట్రోలియం (LPG) సర్వీస్ ప్రొవైడర్ HP గ్యాస్ “HP Anytime” సర్వీస్ కింద కస్టమర్లకు బుకింగ్ ఆప్షన్ అందిస్తోంది. వినియోగదారులు 7718955555కు కాల్ చేసి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా బుకింగ్ కోసం 9222201122 నంబర్ కు మెసేజ్ చేయొచ్చు.
మిస్డ్ కాల్ ద్వారా సిలిండర్లను బుకింగ్ కోసం 9493602222 నంబర్‌కు డయాల్ చేయొచ్చు. ఏదైనా సమాచారం లేదా అసిస్టెన్స్ కోసం అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ 18002333555 కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు అధికారిక హిందూస్తాన్ పెట్రోలియం వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్లు కూడా అక్కడే చేయవచ్చు.
LPG ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 1906 :
వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునేందుకు అధికారిక నంబర్లు, వెబ్సైట్లు, యాప్‌లను మాత్రమే వాడాలి. గుర్తుతెలియని నంబర్లు, అనుమానాస్పద లింక్‌ల ద్వారా బుక్ చేసుకోవద్దు.
గ్యాస్ లీకేజీ వంటి ఎమర్జెన్సీ ఉంటే వెంటనే నేషనల్ ఎల్పీజీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 1906 కాల్ చేయొచ్చు. గ్యాస్ సంబంధిత ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు సంభిస్తే తక్షణ సాయం కోసం ఈ నంబర్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది.
