Akshata Murty Wealth : 2024 ‘రిచ్ లిస్ట్’​ విడుదల.. యూకే ప్రధాని​ రిషి సునక్ కన్నా భార్య అక్షితా మూర్తి సంపాదనే ఎక్కువ..!

2024 'రిచ్ లిస్ట్'​లో అక్షతా మూర్తి సంపాదన ఆమె భర్త కన్నా చాలా ఎక్కువ. రిషి సునక్ 2022-23లో జీబీపీ 2.2 మిలియన్ల పౌండ్లు సంపాదించగా.. గత ఏడాది డివిడెండ్‌లలో 13 మిలియన్ల డివిడెండ్‌లను భార్య అక్షతామూర్తి ఆర్జించారు.

Akshata Murty Wealth : 2024 ‘రిచ్ లిస్ట్’​ విడుదల.. యూకే ప్రధాని​ రిషి సునక్ కన్నా భార్య అక్షితా మూర్తి సంపాదనే ఎక్కువ..!

UK PM Rishi Sunak, Wife Akshata Murty's Wealth ( Image Credit : Google / AFP)

Akshata Murty Wealth : రెండేళ్ల క్రితం వార్షిక ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’లో అరంగేట్రం చేసిన బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ సతీమణి అక్షతా మూర్తి శుక్రవారం (మే 17) విడుదల చేసిన 2024 ఎడిషన్‌లోనూ టాప్ ర్యాంకులో నిలిచారు. ఇటీవల ఇన్ఫోసిస్ షేర్‌హోల్డింగ్‌ భారీ పెరగడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. 44 ఏళ్ల దంపతులిద్దరూ గత ఏడాదిలో 275వ స్థానం నుంచి 245వ స్థానానికి చేరుకున్నారు. జీబీపీ 651 మిలియన్ల సంపదతో 10 డౌనింగ్ స్ట్రీట్ హోమ్‌’ అత్యంత సంపన్న వ్యక్తులుగా నిలిచారు. ఫిబ్రవరిలో ఆర్థిక నివేదికల ప్రకారం.. అక్షతా మూర్తి సంపాదన ఆమె భర్త కన్నా చాలా ఎక్కువగా వెల్లడించింది. రిషి సునక్ 2022-23లో జీబీపీ 2.2 మిలియన్ల పౌండ్లు సంపాదించగా.. గత ఏడాది డివిడెండ్‌లలో 13 మిలియన్ల డివిడెండ్‌లను భార్య అక్షతామూర్తి ఆర్జించారు.

Read Also : Twitter No More : ట్విట్టర్ యూఆర్ఎల్ మారిందోచ్.. ఇకపై అధికారికగా ‘ఎక్స్’ వచ్చేసింది.. చెక్ చేశారా?

కంపెనీ షేర్ల వాటా విలువ పెరగడంతో :
ఈ జంటకు అత్యంత విలువైన ఆస్తి ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటానే. అక్షతా మూర్తి తండ్రి నారాయణ మూర్తి సహ-స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీలో వాటా షేర్ల విలువ భారీగా పెరగడంతో ఆమె సంపాదన ఒక్కసారిగా పైగా ఎగబాకింది. గత ఏడాది కంపెనీ షేర్ల విలువ జీబీపీ 108.8 మిలియన్ల నుంచి దాదాపు జీబీపీ 590 మిలియన్లకు పెరిగింది. తాజా వార్షిక నివేదిక ప్రకారం.. ఆ సమయంలో మూర్తి జీబీపీ 13 మిలియన్ల డివిడెండ్‌లను పొందారు. గత సంవత్సరాల్లో అత్యంత పారితోషకాన్ని ఆమె అందుకున్నారు. ఈ ఏడాదిలో మరో 10.5 మిలియన్ల జీబీపీని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో భారతీయ సంతతికి చెందిన హిందూజా కుటుంబం మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో లండన్‌లో వారి సంపద పెరిగి జీబీపీ 37.196 బిలియన్లకు చేరుకుంది.

రిచ్ లిస్టులో టాప్ 10 భారత సంతతి సంపన్నులు వీరే :
జీపీ హిందుజా నేతృత్వంలోని యూకే-ఆధారిత కుటుంబ కంపెనీ గ్రూపు 48 దేశాల్లో అనేక రంగాలలో పనిచేస్తుంది. అందులో ఆటోమోటివ్, ఆయిల్, స్పెషాలిటీ కెమికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్, ట్రేడింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్, మీడియా, ఎంటర్‌టైన్మెంట్, పవర్, రియల్ ఎస్టేట్ వంటివి ఉన్నాయి. 2024 ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’లో మొదటి 10 మంది భారత్‌లో జన్మించిన డేవిడ్, సైమన్ రూబెన్ సోదరులు ఉన్నారు. వీరి సంపదను గత ఏడాది నాల్గవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకారు. వీరిద్దరి సంపద సుమారు జీబీపీ 24.977 బిలియన్లుగా అంచనా. ఆర్సెలార్‌ మిట్టల్ స్టీల్‌వర్క్స్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ 8వ స్థానంలో ఉన్నారు. గత ఏడాదిలో జీబీపీ 14.921 బిలియన్లతో రెండు స్థానాలు దిగజారారు. వేదాంత రిసోర్సెస్‌కు చెందిన పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ జీబీపీ 7 బిలియన్లతో 23వ స్థానంలో ఉన్నారు.

2024 జాబితాలోని ఇతర భారతీయ సంతతికి చెందిన బిలియనీర్‌లలో టెక్స్‌టైల్స్ వ్యవస్థాపకుడు ప్రకాష్ లోహియా 6.23 బిలియన్ల జీబీపీతో 30వ స్థానంలో ఉన్నారు. రిటైల్ మేజర్లు మొహ్సిన్, జుబెర్ ఇస్సా జీబీపీ 5 బిలియన్లతో 39వ స్థానంలో ఉన్నారు. ఫార్మా చీఫ్‌లు నవీన్, వర్ష ఇంజనీర్ జీబీపీ 3 బిలియన్లతో 58 వద్ద ఉన్నారు. టాప్ 100 మంది ధనవంతులైన బ్రిటన్‌లలో సోదరులు సైమన్, బాబీ, రాబిన్ అరోరా జీబీపీ 2.682 బిలియన్లతో 65వ స్థానంలో ఉన్నారు. ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ ఫ్యామిలీ జీబీపీ 2.6 బిలియన్ల సంపదతో 67వ స్థానంలో ఉన్నారు. గత ఏడాదిలో కొత్తగా ప్రవేశించిన ఫ్యాషన్ పారిశ్రామికవేత్త సుందర్ జెనోమల్ జీబీపీ 2.214 బిలియన్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు. హోటల్ వ్యాపారులు జస్మిందర్ సింగ్ కుటుంబం జీబీపీ 2.001 బిలియన్‌లతో 83వ స్థానంలో ఉన్నారు.

Read Also : Realme P1 Pro 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల 21న రియల్‌మి P1 ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్.. ధర ఎంతంటే?