Price Hike: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతోన్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ రేట్లు

కొత్త సంవత్సరంలో ఎయిర్ కండిషనర్లు(AC), రిఫ్రిజిరేటర్(Fridge), వాషింగ్ మిషన్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.

Price Hike: కొత్త సంవత్సరంలో ఎయిర్ కండిషనర్లు(AC), రిఫ్రిజిరేటర్(Fridge), వాషింగ్ మిషన్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇన్‌పుట్ ఖర్చుల భారం కారణంగా ఎలక్ట్రానిక్ కన్స్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల తయారీదారులు రిటైల్ ధరలను పెంచినట్లు ప్రకటించారు. పెరిగిన ముడిసరుకు, రవాణా ఖర్చుల కారణంగా ఫిబ్రవరి, మార్చి 2022 నాటికి వాషింగ్ మెషీన్‌లు 5శాతం నుంచి 10శాతం వరకు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది.

నివేదికల ప్రకారం.. LG, Panasonic, Haier వంటి కొన్ని బ్రాండ్‌లు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. గోద్రేజ్, Sony, Hitachi వంటి ఇతర పెద్ద బ్రాండ్‌లు మాత్రం ఈ త్రైమాసికం చివరి నాటికి ధరలలో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) సమాచారం ప్రకారం.. జనవరి నుంచి మార్చి మధ్య ఉత్పత్తులు కంపెనీల పాలసీలకు అనుగుణంగా 5నుంచి 7శాతం వరకు పెరగవచ్చు. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, AC కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను 3 నుంచి 5శాతం వరకు పెంచాలని Haier అప్లయన్సెస్ ఇండియా యోచిస్తోంది.

పానాసోనిక్ AC ధరలను 8శాతం వరకు పెంచగా.. గృహోపకరణాల కేటగిరీలో ఎల్‌జీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. “అనివార్యమైన” ధరల పెరుగుదల కారణంగా, జాన్సన్ కంట్రోల్స్-హిటాచీ ఎయిర్ కండిషనింగ్ దాని బ్రాండ్ల ధరలను ఏప్రిల్ నాటికి దశలవారీగా 10శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. సోనీ మరియు గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి ఇతర బ్రాండ్‌ల ధరలు మారుతాయా? లేదా తెలియాల్సి ఉంది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా మానవశక్తి అందుబాటులో ఉండకపోవడం.. కారణంగా తయారీలో జాప్యం వల్ల ప్రొడక్టివిటీ కాస్ట్ పెరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు