iPhone 14 Models : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. USB టైప్-C ఛార్జింగ్ పోర్టుతో ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లు రీఎంట్రీ..!

iPhone 14 Models : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లతో రానుంది. అంతేకాదు.. ఇప్పటికే ఉన్న కొన్ని ఐఫోన్ 14 మోడల్‌లు కూడా కొత్త ఛార్జింగ్ పోర్ట్‌లతో మళ్లీ ప్రవేశపెట్టనుందని కొత్త నివేదిక వెల్లడించింది.

2 existing iPhone 14 models to get USB Type-C charging ports along with iPhone 15 series

iPhone 14 Models : ఆపిల్ ఐఫోన్ 14 మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి.. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను USB టైప్-C ఛార్జింగ్‌తో ఈయూ నిబంధనలకు అనుగుణంగా తీసుకురావచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఐఫోన్ 14 ప్రస్తుత మోడల్‌లలో కొన్ని కొత్త ఛార్జింగ్ పోర్ట్‌లతో మళ్లీ మార్కెట్లోకి రానున్నాయని కొత్త నివేదికలు సూచిస్తున్నాయి.

ఆపిల్ అభిమానులు లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరులో ఐఫోన్ 15 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ మోడల్ USB-C ఛార్జింగ్‌ పోర్టులతో రానుంది. లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా iPhone 15 మోడల్ రానుందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. ఐఫోన్ యూజర్ @aaronp613 చేసిన ఒక ట్వీట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సేల్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. లాంచ్ ఈవెంట్‌కు ముందే ఫీచర్లు లీక్..!

TVOS17 బీటా కోడ్‌లో ఐఫోన్ 15 మాత్రమే కాకుండా మరో పాత మోడల్ ఫోన్లు ఉన్నాయని పోస్ట్ వెల్లడించింది. అందులో మరో రెండు ఐఫోన్ 14 మోడల్స్, iPhone 14, iPhone 14 Plus ఉంటాయని నివేదిక తెలిపింది. ముఖ్యంగా, ఈ డెవలప్‌మెంట్ ఐఫోన్ 15 అరంగేట్రంపై ఆపిల్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ మోడళ్లను నిలిపివేయనుందని సూచిస్తుంది.

iPhone 14 Models : 2 existing iPhone 14 models to get USB Type-C charging ports along with iPhone 15 series

అయినప్పటికీ, 2018లో ఆపిల్ ఐప్యాడ్ ప్రోతో USB-C ఛార్జింగ్‌ను ప్రవేశపెట్టగా.. అన్ని ఐప్యాడ్ మోడల్‌లు USB-C ఛార్జింగ్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఐఫోన్ లైటనింగ్ పోర్ట్‌కు ఇంటిగ్రేట్ అయి ఉంది. ఈ మార్పుకు యూరోపియన్ యూనియన్ (EU) నిబంధనలే కారణమని చెప్పవచ్చు.

USB-C ఛార్జింగ్ పోర్టులపై గత సంవత్సరమే అమలు చేయగా, టెక్ దిగ్గజాలను 2024 నాటికి ఈ నిబంధలను పాటించాలని లేదంటే ఈయూ మార్కెట్‌లో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించింది.

Read Also : Apple iPhone 16 Pro : ఐఫోన్ 15 ఇంకా రానే లేదు.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్స్ ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు